GRAND BTU OF SRI KRT FROM APRIL 5-13- TTD JEO _ అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు – బ్ర‌హ్మోత్స‌వాల‌ ఏర్పాట్లపై జేఈవో సమీక్ష

Tirupati,27 March 2024: TTD JEO Sri Veerabrahmam said TTD will organise the annual Brahmotsavam of Sri Kodandaramaswami temple on a grand scale from April5-13 with Ankurarpanam fete on April 4.

Speaking to media after a review meeting on Wednesday evening with officials the JEO said the festivities will begin with Dwajarohanam on April 5th and spectacular Vahana Sevas both morning and evening.

He said the highlight of Brahmotsavam festivities were the majestic Garuda Vahana Seva on the April 9th evening and would attract large crowds in view of the Ugadi festival. Among others, Hanumanta Vahana on April 10 and Chakra snanam on April 13 will be held heralding the conclusion of the Brahmotsavam celebrations.

JEO said Vahana Sevas will be organised on days morning between 07.00-10.00 am and evening between 7.00-9.00 pm. All departments would coordinate all out preparations for Anna Prasadam, cultural programs, security, drinking water, buttermilk, and both floral and electric decorations. He instructed officials for cooler paintings, scrutinise the strength of vahanas, bhajans and kolatas before vahanas.

He also advised for positioning the ambulances, primary health centres.SVBC for live telecast, commentators of Vahana Sevas, distribute Ramakoti books, deploy adequate number of srivari Sevakulu, coordinate with local police for traffic regulation 

He said TTD will organise Sri Rama Navami utsavam from April 17-19 and also the annual Teppotsavam fete from April 21-23.

Dyeos Sri Govindarajan, Smt Shanti, Smt Nagaratna, SE Sri Venkateswarlu, Dharmic projects programming officer Sri Rajagopal,EE Sri Venugopal, VGO Sri Bali Reddy, and additional health officer Dr Sunil were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు – బ్ర‌హ్మోత్స‌వాల‌ ఏర్పాట్లపై జేఈవో సమీక్ష

తిరుపతి, 2024 మార్చి 27: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధ‌వారం రాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాధిపతులతో జేఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, ఏప్రిల్ 4న అంకురార్ప‌ణ‌తో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు ఏప్రిల్ 5న ధ్వజారోహణం, ఏప్రిల్ 9న గ‌రుడ సేవ , ఉగాది పండుగ వస్తున్నందున భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందన్నారు . ఏప్రిల్ 10న హ‌నుమంత వాహ‌నం, ఏప్రిల్ 13వ తేదీన చక్రస్నానంతో. బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 నుండి 10గంటలవరకు , రాత్రి 7 నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారన్నారు . అలాగే ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ తెప్పోత్సవాలు జరుగనున్నాయని వివరించారు.

ఆల‌యంలో ఆక‌ట్టుకునేలా పెయింటింగ్స్‌, రంగ‌వ‌ల్లులు తీర్చ‌దిద్దాల‌ని సూచించారు. రథోత్సవం కోసం రథాన్ని, వాహ‌న సేవల కోసం వాహనాలు ,తండ్ల‌ పటిష్టతను ముంద‌స్తుగా త‌నిఖీ చేయాల‌న్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహనసేవల ముందు భక్తులను ఆకట్టుకునేలా భజనలు, కోలాటాలు, ఇతర కళాబృందాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల శోభను తెలిపేరీతిలో ఆలయ పరిసర ప్రాంతాలలో విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు.

భ‌క్తుల కోసం ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేయాల‌న్నారు . ఎస్వీబీసీ ద్వారా వాహ‌న‌సేవ‌ల‌ను ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయాల‌ని జేఈవో ఆదేశించారు. వాహన సేవకు సంబంధించిన వ్యాఖ్యానం చేసేందుకు వ్యాఖ్యాతలను ఎంపిక చేసుకోవాలన్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ర‌ప్పించాల‌న్నారు. భక్తులు రామకోటి రాసేందుకు వీలుగా పుస్త‌కాలు అందించాలన్నారు. భ‌క్తుల ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు బారీకేడ్లు ఏర్పాటుచేయాల‌ని ఆదేశించారు. స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని జేఈవో ఆదేశించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయాలని, తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని, మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో డ్యెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద‌రాజ‌న్, శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌, శ్రీమతి శాంతి , ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు , ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్,
ఈ ఈ శ్రీ వేణుగోపాల్, విజివో శ్రీ బాలిరెడ్డి, అద‌న‌పు ఆరోగ్య‌శాఖ అధికారి డాక్టర్ సునీల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.