GRAND CELEBRATION OF MATSYA JAYANTI AT SRI VEDA NARAYANASWAMY TEMPLE _ ఘనంగా వేద నారాయణస్వామి వారి ఆలయంలో మత్స్య జయంతి
Tirupati, March 21, 2026: Matsya Jayanti was celebrated with grandeur on Saturday at the Sri Veda Narayanaswamy Temple in Nagalapuram.
On this occasion, the Lord was awakened at 5:00 AM with Suprabhata Seva, followed by Tomala Seva and Archana.
From 7:00 to 8:30 AM, the Matsya Jayanti festival (Tiruveedhi Utsavam) was conducted for Sri Veda Narayanaswamy along with Sri Devi and Bhu Devi. From 9:00 to 11:00 AM, Shanti Homam was performed, and from 11:00 AM to 12:00 noon, Snapana Tirumanjanam was conducted with great devotion.
In the evening, from 7:00 to 9:00 PM, the Lord blessed devotees while being taken in procession on Garuda Vahanam through the temple streets.
Temple Superintendent Sri Muni Shankar, Temple Inspector Sri Changal Rayulu, priests, and a large number of devotees participated in the celebrations.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఘనంగా వేద నారాయణస్వామి వారి ఆలయంలో మత్స్య జయంతి
తిరుపతి, 2026 మార్చి 21: నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామి వారి ఆలయంలో శనివారం మత్స్య జయంతి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి, తోమాల, అర్చన నిర్వహించారు.
అనంతరం ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారికి మత్స్య జయంతి ఉత్సవం(తిరువీధి ఉత్సవం) జరిగింది. ఉదయం 9 నుండి 11 గంటల వరకు శాంతిహోమం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగుతు భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ముని శంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ చంగల్ రాయులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు..




