GRAND KARTHEEKA DEEPOTSAVAM HELD IN SRI KAPILESWARA SWAMY TEMPLE_ శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం

Tirupati, 2 December 2017: Women devotees participated in large number and lighted Pramidas as part of the Kartika Deepotsavam was grandly conducted by the TTD at the Sri Kapileswaralayam on the eve of the Krutika nakshatram this evening.

Speaking on the ocassion the Tirupati Joint Executive Officer Sri Pola Bhaskar said conduction of the Karteeka Deepotsavam at Sri Kapileswaralayam was part of an established tradition continued by the TTD from decades.

Earlier Deeparadhana was performed at Sanctum, temple gopuram, Kamakshi temple gopuram and Dwajasthambam and dyas were set up in a dazzling form of Shivalinga and Trishulam.

Among others TTD CVSO Sri Ake Ravikrishna, Temple DyEO Sri Subramanyam, AEO Shankar Raju and large number of devotees and temple officials participated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం

తిరుపతి, 2017, డిసెంబరు 02: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాయంలో శనివారం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం కృత్తికా దీపోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ఆలయ ప్రాంగణంలో దేదీప్యమానంగా ప్రమిదలు వెలిగించారు. దీపాల వెలుగులో ఆలయం శోభాయమానంగా వెలిగిపోయింది.

ఈ సందర్భంగా టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దీపాలు వెలిగించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని చెప్పారు.

ముందుగా, సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన కొండపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు ఆలయ ప్రాంగణమంతా దీపాలు వెలిగించి భక్తిప్రపత్తులను చాటుకున్నారు. అనంతరం రాత్రి 7.00 గంటలకు జ్వోలాతోరణం వెలిగించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌రాజు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.