GRAND MAHA SHIVARATHRI CELEBRATIONS AT SRIKAPILESWARA TEMPLE _ శ్రీకపిలేశ్వరాలయంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
TIRUMALA TIRUPATI DEVASTHANAMS
GRAND MAHA SHIVARATHRI CELEBRATION S AT SRI KAPILESWARA TEMPLE
Tirupati 21 Feb 20 ; The temple city of Tirupati echoed to the chantings of Hara Hara Mahadeva Sambho Sankara on the auspicious occasion of Maha Shivaratri at Sri Kapileswara Swamy temple as part of the ongoing annual Brahmotsavams on Friday.
After completion of morning rituals, Mahanyasa purvaka ekadasha rudrabhisekam was performed and Sarvadarshanam opened for devotees.
BHOGI TERU OBSERVED
TTD organised a lofty Rathotsavam (Bhogi theru) signalling the importance of Ratham which is an embodiment of human body and mind and when synchronised with God would provide solutions to all ailments and wordly problems.
The devotees were delighted by the sought of Sri Sonaskanda on the wooden chariot.
SNAPANAM
The holy bath ritual ( snapana thirumanjanam) was performed to,the utsava idols of Sri Skandamurthy and Sri Kamakshi Ammavaru.
This fete is usually observed as a soothing relief to the deities who continuously engaged in morning and evening vahanams.
ARRANGEMENTS
As part of Nandi Vahana Seva during Brahmotsavams on Friday evening and in view of Mahasivaratri, TTD has made elaborate arrangements.
After Nandi vahanam in the evening, the Lingodbhava Abhisekams will be performed from midnight till 4am of February 22.
On the instructions of TTD EO Sri Anil Kumar Singhal and in the supervision of JEO Sri P Basant Kumar special arrangements for queue lines, parking slots for two and four wheelers and Anna Prasadam, drinking water and buttermilk distribution for all devotees have been made by TTD.
250 srivari sevaks, 150 Scouts apart from 100 TTD vigilance sleuths were pressed into service.
Siva Parvati Kalyanam on February 22.
On Saturday evening, TTD is organising a colourful Siva Parvati Kalyanotsavam.
Interested devotees could participate with a ticket of ₹250 and beget blessings of deities.
UNION MINISTER OFFERS PRAYERS
The Union Minister of State for Small, Medium Industries Sri Pratapchandra Sarangi visited Sri Kapileswara Swamy temple in view of Maha Shivaratri on Friday.
He was given a ceremonial welcome by temple officials and archakas at the temple dwaram. After darshan of the presiding deity and Kamakshi Devi he was offered prasadams.
Dy EO Sri Subramanyam, Superintendent Sri Bhupathi Raju, Temple inspectors Sri Reddy Sekhar and Sri Srinivas Naik and others participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీకపిలేశ్వరాలయంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
తిరుపతి, 2020 ఫిబ్రవరి 21 ;తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు.
తెల్లవారుజామున సుప్రభాతం అనంతరం 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 5.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభమైంది.
ఘనంగా రథోత్సవం(భోగితేరు) :
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు రథోత్సవం(భోగితేరు) కన్నులపండువగా జరిగింది. ఆత్మ రథికుడు. శరీరమే రథం. బుద్ధి సారథి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.
వేడుకగా స్నపనతిరుమంజనం :
ఈ సందర్భంగా అర్చకులు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. శ్రీస్కోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు.
నంది వాహనం :
సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు నంది వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుపతి పురవీధుల్లో ఈ వాహనసేవ నిర్వహిస్తారు. శ్రీకపిలేశ్వరస్వామివారికి నంది వాహనం ఎంతో విశేషమైనది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వాహనసేవకు హాజరవుతారు. రాత్రి 12 నుండి శనివారం ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహిస్తారు.
ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించేందుకు, వెలుపలికి వచ్చేందుకు ప్రత్యేకంగా క్యూలైన్లు రూపొందించారు. భక్తులకు, నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ద్విచక్రవాహనాలకు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీవారి సేవకులు భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ, క్యూలైన్ల క్రమబద్ధీకరణ తదితర సేవలందించారు.
ఫిబ్రవరి 22న శివపార్వతుల కల్యాణం :
శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శనివారం శివపార్వతుల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) అప్పటికప్పుడు రూ.250/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
శ్రీకపిలేశ్వరస్వామివారిని దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారిని మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి గౌ. శ్రీ ప్రతాప్‌చంద్ర సారంగి దర్శించుకున్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ. కేంద్ర సహాయ మంత్రికి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని శ్రీ కపిలేశ్వరస్వామివారిని, శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయాధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి, సూపరింటెండెంట్ శ్రీ భూపతిరాజు, ఎవిఎస్వో శ్రీ నందీశ్వరరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస్‌నాయక్ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.