GRAND PAVITHROTSAVAM AT SRI PRASANNA VENKATESWARA SWAMY TEMPLE_ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్రోత్సవాలు

Tirupati, 6 October 2018: Pavitra Pratistha ritual was performed at the Sri Prasanna Venkateswara Swamy Temple of Appalayagunta on Day 2 of Pavitrotsavam after daily practices of Suprabatham, Melkolapu, Tomala seva, Koluvu and Archana.

Later at night Punya havachanam, Vishwak sena Aradhana, Kalabandhanam and Kumbharadhaam were performed at the Yagashala before traditional Pavitra prathistha.

Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Supdt Sri Gopalakrishna Reddy, Temple inspector Sri Srinivasa Raju, Temple priests, others officials and devotees participated


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్రోత్సవాలు

తిరుపతి, 2018 అక్టోబరు 06: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన శనివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమలసేవ, కొలువు, అర్చన నిర్వహించారు.

అనంతరం రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, రక్షాబంధనం, కుంభరాధనం నిర్వహించనున్నారు. అనంతరం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.