GRAND RATHA SAPTHAMI IN TELUGU STATES_ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రథసప్తమి వేడుకలు

Tirupati, 24 January 2018: Grand Ratha Satpthami was celebrated in all district towns of Telugu states besides Banalore, Chennai cities.

The devotional wings of HDPP, Annamacharya Project, Dasa Sahitya project conducted various programs like Surya Namaskarams, Aditya Hriday Slokas and distribution of booklets besides various cultural programs like bhkati sangeet. While 16 groups of 310 artists participated in programs at Srivari Temple, 22 groups of 375 artistes performed at all the TTD local temples on the oassion of Rathasapthami.

TEPPOTSAVAM IN SRI GT FROM JAN 25 TO 31

The holy ritual of Teppotsavam will be performed at the Sri Govindaraja swam temple from January 25-31. The seven day event will be a feast of cultural programs and rituals

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రథసప్తమి వేడుకలు

తిరుపతి, 2018 జనవరి 24: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ బుధవారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో ఉదయం సూర్యనమస్కారాలు చేయించారు. ఆదిత్యహృదయం శ్లోకాలు పారాయణం చేయించారు. విద్యార్థులకు రథసప్తమి విశిష్టత పుస్తకాలను పంపిణీ చేశారు.

రథసప్తమికి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు :

రథసప్తమి పర్వదినం సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయ.

బుధవారం తిరుమల శ్రీవారికి, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి నిర్వహించిన సప్తవాహన సేవలలోను, తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో నిర్వహించిన సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహన సేవల ముందు ఏర్పాటుచేసిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుమల శ్రీవారి వాహనసేవలలో 16 గ్రూపులలో 310 మంది కళాకారులు పాల్గొన్నారు. తిరుపతిలోని అనుబంధ ఆలయాలలో 22 గ్రూపులలో 375 మంది కళాకారులు పాల్గొన్నారు. వీరు చెక్కభజనలు, పండరి భజనలు, కోలాటాలు, చిడతలు, డ్రమ్స్‌, పిల్లనగ్రోవి తదితర కళా ప్రదర్శనలు ఇచ్చారు. వాహనసేవల్లో పాల్గొన్న భక్తులకు విష్ణుసహస్రనామం, రథసప్తమి విశిష్టత, వాహనసేవలు, 5 భాషల్లో గోవిందనామాలతో పుస్తక ప్రసాదం అందించారు.

జనవరి 25 నుండి 31వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు జనవరి 25 నుండి 31వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

జనవరి 25న శ్రీ కోదండరామస్వామివారు – 5 చుట్లు

జనవరి 26న శ్రీ పార్థసారథిస్వామివారు – 5 చుట్లు

జనవరి 27న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు – 5 చుట్లు

జనవరి 28న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు – 5 చుట్లు

జనవరి 29, 30, 31వ తేదీల్లో శ్రీగోవిందరాజస్వామివారు – 7 చుట్లు

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.