SRI RAMA NAVAMI CELEBRATIONS IN KRT _ శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

TIRUPATI, 30 MARCH 2023: The Sri Rama Navami festivities are being observed with celestial fervour in Sri Kodanda Ramalayam in Tirupati on Thursday.

After performing Abhishekam to Mulavirat in the morning, Snapana Tirumanjanam was rendered to the utsava deities in Unjal Mandapam. In the evening, new vastrams to deities were decorated to the main deities and utsava deities and later Sri Rama Navami Asthanam was performed. 

In the evening, Hanumantha Vahana Seva will be observed between 7pm and 9pm.

Deputy EO Smt Nagarathna, AEO Sri Mohan and other office staffs, devotees were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

తిరుపతి, 2023 మార్చి 30: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.

తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం మూలవర్లకు అభిషేకం చేశారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఊంజల్‌ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారి మఠం నుండి అర్చకులు నూతన వస్త్రాలను తీసుకొని విమానప్రదక్షిణగా వచ్చి స్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. ఆ తరువాత శ్రీరామ జన్మపురాణం, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ, అనంతరం ఉత్సవమూర్తులను వాహన మండపానికి వేంచేపు చేస్తారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీరామచంద్రమూర్తి తన ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌ కుమార్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.