GRAND VASANTHOTSAVAM IN SRI KVST BEGINS_ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం

Srinivasa Mangapuram, 5 May 2018: The celestial utsavam of Annual Vasanthotsavam commenced on Saturday at Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram. After the morning rituals of Suprabatam, Thomala Seva and Sahasranama Archana, the utsava idols were taken out to Vasantha mandapam for Asthanam.

As part of the ritual Snapana Tirumanjanam was performed to the Utsava Deities along with His consorts Sri Devi and Bhudevi with milk, curd, honey, sandal paste and fruit juices. In the evening the Unjal seva was performed for the deities before they were paraded in the mada streets in the Thiruveedhi utsavam.

SWARNA RATHOTSAVAM ON MAY 6

The Swarna Rathotsvam will be performed for the utsava idols in the evening of May 6.The devotee couple who wants to participate in the vasantotosavam with a token payment of Rs.516 will beget one uttariyam, one blouse piece and anna prasadam as bahumanam.

The TTD has cancelled the arjitha sevas- Kalyanotsavam, Swarna Pushparchana, Astothara Shata Kalashabisekam at the Sri KVS Temple in view of Vasanthotsavam.

Local Temples DyEO Sri Venkataiah, Temple Supdt Sri Ramanaiah, Temple Inspector Sri Anil Kumar and temple priests and officials along with devotees participated in the glittering event.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2018 మే 05: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్త్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంతమండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.

మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.00. నుండి 6.00 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మే 6న స్వర్ణరథోత్సవం :

మే 6వ తేదీ ఆదివారం సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, స్వర్ణపుష్పార్చన, అష్టోత్తర శతకలశాభిషేకం సేవలను రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకటయ్య, సూపరింటెండెంట్లు శ్రీ రమణయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీఅనీల్‌ కుమార్‌, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.