GRAND VIMANA KALASH INSTALLATION FETE AT VIZAG SV TEMPLE _ విశాఖ‌ శ్రీ‌వారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా విమాన క‌ల‌శ‌స్థాప‌న‌

Visakhapatnam 21 Mar. 22: TTD organised grand fete of Vimana Kalash installation at Sri Venkateswara temple, Visakhapatnam on Monday morning to the rhythm of Mangala Vadyams and Vedic mantras.

 

The festivities of the Maha samprokshana underway at the newly built SV temple on the shores of Visakhapatnam included homas, kalasha sthapana and Bimbo sthapana etc. at the yagashala throughout the day.

 

Earlier the TTD CVSO Sri Gopinath Jatti inspected the residue development works at the temple site and directed officials to remove the debris materials from the site and clear the temple surroundings of all haphazardly parked vehicles.

 

He also went around some rooms below the temple including the command control room and made some valuable suggestions.

 

Among others, the CVSO also inspected the functioning of local security staff, public address system and Srivari sevakula placements.

 

SE Sri. satyanarayana, Dyeo Sri Ramana Prasad, VGO Sri Manohar, EE Sri Sudhakar DE Electrical Sri Chandrasekhar, AVSOs Sri Giridhar and Sri Narayana were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విశాఖ‌ శ్రీ‌వారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా విమాన క‌ల‌శ‌స్థాప‌న‌

తిరుపతి, 2022 మార్చి 21: విశాఖ‌ప‌ట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా సోమ‌వారం ఉద‌యం శాస్త్రోక్తంగా విమాన క‌ల‌శ‌స్థాప‌న నిర్వ‌హించారు.

ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట‌ వ‌ర‌కు హోమం, జ‌లాధివాసం, యాగ‌శాల కార్యక్ర‌మాలు, ర‌త్న‌న్యాసం, విమాన క‌ల‌శ‌స్థాప‌న‌, బింబ‌స్థాప‌న నిర్వ‌హించారు. అనంత‌రం సాయంత్రం 6 నుండి హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు ప్రారంభమయ్యాయి.


అంతకుముందు సివిఎస్ ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని రాళ్ళు రప్పలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఆలయం పరిసరాల్లో ఉన్న వాహనాలను బయటకు పంపాలని విజిలెన్స్ సిబ్బందిని ఆదేశించారు. ఆలయం కింది భాగంలో ఉన్న పలు గదులను పరిశీలించారు. అందులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఆలయ పరిసరాల్లో భద్రతా సిబ్బంది పనితీరును, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, శ్రీవారి సేవకుల సేవలను పరిశీలించారు.

ఎస్ఇ శ్రీ సత్యనారాయణ, డెప్యూటీ ఈవో శ్రీ ర‌మ‌ణ ప్ర‌సాద్‌, విజివో శ్రీ మనోహర్, ఇఇ శ్రీ సుధాకర్, డిఈ ఎలక్ట్రికల్ శ్రీ చంద్రశేఖర్, ఏవీఎస్ఓలు శ్రీ గిరిధర్, శ్రీ నారాయణ పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.