GRANDUER OF LORD ON PEDDA SESHA VAHANAM_పెద్దశేష వాహనంపై శ్రీనివాసుడి వైభవం
Srinivasa Mangapuram, 06 February 2018 ; As part of the Day 1 of annual Brahmotsavam of Sri Kalyana Venkateswara temple, Srinivasa Mangapuram Lord Venkateswara will ride Pedda Sesha Vahanam and bless the devotees.
The Pedda Sesha vahanam an iconic representation of Srinivasa as Lord of seven hills and his vahanam is Sehshashayi. Lord’s darshan on the unique vahanam is seen as a blessing for all devotees and shower of good fortunes, prosperity and good health.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
పెద్దశేష వాహనంపై శ్రీనివాసుడి వైభవం
ఫిబ్రవరి 06, తిరుపతి, 2018; శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మూెత్సవాల్లో మొదటిరోజు మంగళవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
బ్రహ్మూెత్సవాల్లో శ్రీవారు స్వయంగా ఊరేగింపులో పాల్గొనే మొదటి ఉత్సవం పెద్దశేషవాహనం. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శ్రీవారి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.