GT ANKURARPANAM HELD _ శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Tirupati, 15 May 2024: The Ankurarpanam fete was observed with religious fervour in Sri Govindaraja Swamy temple on Wednesday evening in Tirupati.
 
As the annual brahmotsavam or scheduled to commence from May 16 onwards, the ritual of prelude was conducted.
 
The important days includes Dhwajarohanam on May 16 in the auspicious Mithuna Lagnam between 8:15am and 8:40am.
 
Garuda Seva is on May  20, Rathotsavam on May 23 and Chakrasnanam on May 24.
 
Devotional cultural programmes have been arranges to lure the devotees.
 
Both the senior and junior Seers of Tirumala, DyEO Smt Shanti and others were present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
 

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2024 మే 15: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.

సాయంత్రం 5.30 గంటల నుండి అంకురార్పణ ఘట్టం ప్రారంభమైంది. ముందుగా సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, సూప‌రింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ధ‌నంజ‌య‌ పాల్గొన్నారు.

మే 16న ధ్వజారోహణం :

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు మే 16వ తేదీ ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

16-05-2024

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – పెద్దశేష వాహనం

17-05-2024

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

18-05-2024

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

19-05-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

20-05-2024

ఉదయం – మోహినీ అవతారం

రాత్రి – గరుడ వాహనం

21-05-2024

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి – గజ వాహనం

22-05-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

23-05-2024

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

24-05-2024

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.