SRI GT TEPPOTSAVAMS FROM FEB 13 TO 19_ ఫిబ్రవరి 13వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
Tirupati, 8 Feb. 19: The annual teppotsavams of Sri Govindaraja Swamy temple in Tirupati will be observed from February 13 to 19.
This five day Teppotsavams takes place everyday in Sri Govindaraja Swamy Pushkarani located near Vishnunivasam Rest house.
This float festival wil be between 6pm and 8pm during these days.
Later Temple DyEO Smt Varalakshmi released wall posters inside temple premises.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
ఫిబ్రవరి 13వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి,2019 ఫిబ్రవరి 08: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 13 నుండి 19వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
ఫిబ్రవరి 13న శ్రీ కోదండరామస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 14న శ్రీ పార్థసారథిస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 15న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 16న ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 17, 18, 19వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు – 7 చుట్లు.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.