PERIYALWAR SATTUMORA IN SRI GT_ ఘనంగా శ్రీ పెరియాళ్వార్‌ శాత్తుమొర

Tirupati, 23 Jun. 18: Sri Periyalwar Sattumora was observed in Sri Lakshminarayana Swamy temple which is a sub-shrine in Sri Govinda Raja Swamy temple in Tirupati.

Snapana Tirumanjanam was performed to Sri Lakshminarasimha Swamy from the holy waters brought from Narasimha Teertham.

Later in the evening Garuda Seva will be observed for processional deity of Lord Govindaraja Swamy while Sri Periyalwar was taken on a celestial ride on Gaja Vahanam. Later Sattumora, purana pathanam rendered in Periyalwar Sannidhi.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా శ్రీ పెరియాళ్వార్‌ శాత్తుమొర

తిరుపతి, 2018 జూన్‌ 23: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో గల శ్రీ పెరియాళ్వార్‌వారి శాత్తుమొర శనివారం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం 8.00 గంటలకు నరసింహతీర్థం నుంచి శ్రీలక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి తిరుమంజనం తీర్థం తీసుకొచ్చారు. ఉదయం 9.00 నుంచి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంద్ర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 5.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై, శ్రీపెరియాళ్వార్‌వారు గజవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం శ్రీపెరియాళ్వార్‌ వారి సన్నిధిలో శాత్తుమొర, అవతార పురాణ పఠనం, ఆస్థానం చేపడతారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్‌స్వామి, టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఇవో శ్రీ ఉదయ్‌ భాస్కర్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీజ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.