GUDIKO GOMATA AT KALIGIRIKONDA TEMPLE _ కలిగిరి కొండ శ్రీవారి ఆలయంలో గుడికో గోమాత
Tirupati, 17 Dec. 20: TTD Chairman Sri YV Subba Reddy on Thursday handed over a pair of a cow and calf to Sri Venkateswara temple, Kaligirikonda in Penumuru mandal as part of Gudiko Gomata program.
The Chairman was welcomed with a Purna kumbha welcome at the temple and thereafter he offered prayers and begot blessings.
Deputy CM Sri Narayana Swamy, Chittoor MP Sri Reddappa, MLAs Sri M S Babu, Sri J Srinivasulu, Sri Adimoolam HDPP co opted member Sri Penchalaih, Sri T Babu, Dayasagar Reddy and other officials were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కలిగిరి కొండ శ్రీవారి ఆలయంలో గుడికో గోమాత
– ఆవు దూడ అందించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుపతి 17 డిసెంబరు 2020: పెనుమూరు మండలం లో టీటీడీ ఇటీవల విలీనం చేసుకున్న కలిగిరి కొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం సాయంత్రం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి ఆలయానికి గోవు, దూడను అందించారు. అనంతరం చైర్మన్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. డిప్యూటి సీఎం శ్రీ నారాయణ స్వామి, చిత్తూరు ఎంపి శ్రీ రెడ్డెప్ప, శాసన సభ్యులు శ్రీ ఎం ఎస్ బాబు, శ్రీ జంగాల పల్లి శ్రీనివాసులు, శ్రీ ఆదిమూలం, ధర్మ ప్రచార పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు శ్రీ పెంచలయ్య, శ్రీ తలపులపల్లి బాబు, దయాసాగర్ రెడ్డి తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.