GURUVANDANA MAHOTSAVAM ON JULY 8 AND 9_ జూలై 8, 9వ తేదీల్లో రాజమండ్రిలో గురువందన మహోత్సవం

Tirupati, 4 July 2017: In connection with Guru Pournami, the Dasa Sahitya Project of TTD will organise Guruvandana Mahotsavam on July 8 and 9 in the TTD Kalyanamandapam located in Rajamundry.

The bhajan troupes from AP, TS, TN, Karnataka and Maharastra will take part in this fete and perform community bhajans.

On the second day there will be religious discourses with pontiffs of various mutts. Project Special Officer Sri PR Anandateerthacharyulu supervising the arrangements.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 8, 9వ తేదీల్లో రాజమండ్రిలో గురువందన మహోత్సవం

తిరుపతి, 2017 జూలై 04: గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో రాజమండ్రిలోని టిటిడి కల్యాణమండపాల ప్రాంగణంలో జూలై 8, 9వ తేదీల్లో గురువందన మహోత్సవం ఘనంగా జరుగనుంది.

ఇందులోభాగంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భజనమండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖ పండితులతో ఆధ్యాత్మిక – ధార్మిక సందేశాలు, నామసంకీర్తన-సంగీత విభావరి కార్యక్రమాలు జరుగనున్నాయి.

రెండో రోజు ఉదయం నగర సంకీర్తన, ప్రముఖ మఠాధిపతులతో గురుబోధ, గురుమహిమ కీర్తనలు – ప్రవచన కార్యక్రమాలు చేపడతారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీపి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.