GUV PRAYS IN HILL SHRINE_ శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌

Tirumala, 15 July 2019: The Honourable Governor of AP and TS Sri ESL Narasimhan offered prayers in the Hill Shrine of Tirumala on Monday morning.

Earlier, following the temple tradition he first paved a visit to Sri Varaha Swamy temple and later upon his arrival at Mahadwaram he was offered traditional Isthikaphal welcome by temple priests and given warm reception by Special Officer Sri AV Dharma Reddy.

Later the Vedic pundits rendered Vedasirvachanam in Ranganayakula Mandapam. The SO presented the first citizen of the state with Theertha Prasadams and a laminated photo of Lord.

CVSO Sri Gopinath Jatti, Suptd of Police Sri Anburajan, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham, Parpathyedar Sri Ramachandra and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌

తిరుమల, 2019 జూలై 15: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్ సోమ‌వారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి ఆలయం మ‌హాద్వారం వ‌ద్ద గౌ|| గవర్నర్‌ దంపతులకు టిటిడి తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్‌” ఆలయ మర్యాదలతో ఆగమోక్తంగా స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం గౌ|| గవర్నర్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం శ్రీ‌వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో గౌ|| గవర్నర్‌ దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా తిరుమల ప్ర‌త్యేకాధికారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.

ముందుగా క్షేత్ర సాంప్ర‌దాయాన్ని పాటిస్తూ గౌ|| గవర్నర్‌ దంపతులు శ్రీ వ‌ర‌హ‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటి ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ లోక‌నాథం, ఆల‌య ఒఎస్‌డి శ్రీ పాల శేష‌ద్రి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.