HAMSA VAHANA SEVA HELD _ హంస వాహనంపై శ్రీ కోదండరాముడి అభయం

Tirupati, 28 March 2025: The second evening on Friday, the devotees witnessed Sri Rama taking a celestial ride on Hamsa Vahanam in Saraswati Alankaram during the ongoing annual Brahmotsavams at Sri Kodandarama Swamy temple in Tirupati.

On the other hand, the cultural troupes and Sangeeta-Nritya artistes enhanced the grandeur of the Vahana seva.

Both the seers of Tirumala, DyEO Smt Nagaratna, AEO Sri Ravi, Superintendent Sri Munisekhar and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హంస వాహనంపై శ్రీ కోదండరాముడి అభయం

తిరుపతి, 2025 మార్చి 28: తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం రాత్రి 7 గంట‌ల నుండి హంస వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు అభయమిచ్చారు.

గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, పిఆర్ఓ (ఎఫ్ఏసి) కుమారి నీలిమ, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్‌ శ్రీ ముని శంకరన్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.