HAMSA VAHANA SEVA OBSERVED _ హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం
VONTIMITTA, 01 APRIL 2023: The ongoing annual brahmotsavam Vontimitta has witnessed Hamsa Vahana Seva on Saturday evening.
On Sri Sita Lakshmana sameta Sri Ramachandra Murty took out a celestial ride Hamsa Vahanam with a colourful procession led by Bhajana teams.
Deputy EO Sri Natesh Babu, SE Electrical Sri Venkateswarulu, Manuscripts Special Officer Smt Vijayalakshmi and others were present.
Earlier, in the evening during Unjal Seva the devotional vocal concert by Sri Subrahmanyam and team, Mangaladhwani by SVCMD faculty, religious discourse by Sri Hayagreevacharyulu, Harikatha by Smt Nagamani allured devotees.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం
ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 01: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రాత్రి 7 గంటల నుండి హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సోహం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, ఎస్ఇ ఎలక్ట్రికల్స్ శ్రీ వెంకటేశ్వర్లు, ఏఈఓ శ్రీ గోపాలరావు, సూపరింటెండెంట్లు శ్రీ పి.వెంకటేశయ్య, శ్రీ ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.