HAMSA VAHANAM TAKES PLACE _ హంస వాహనంపై శ్రీ కోదండ‌రాముడి క‌టాక్షం

TIRUPATI, 31 MARCH 2022: As part of the ongoing annual Brahmotsavams in Sri Kodanda Rama Swamy temple in Tirupati, the processional deity took a celestial ride on Hamsa Vahana to bless His devotees along four Mada streets on Thursday evening.

 

Both the Pontiffs of Tirumala, JEO Sri Veerabrahmam, Spl Gr DyEO Smt Parvati and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హంస వాహనంపై శ్రీ కోదండ‌రాముడి క‌టాక్షం

తిరుప‌తి, 2022 మార్చి 31: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి హంస‌ వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవ ఆల‌య నాలుగు మాడ వీధుల్లో రాత్రి 10 గంటల వరకు జరగనుంది.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

వాహ‌న‌సేవ‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.