HANUMA IS AN ICON OF SERVICE AND COURAGE-KURTALAM SEER _ ఆంజనేయుడు శివాంశ సంభూతుడు : శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి 

DEVOTIONAL PROGRAMS HELD

TIRUMALA, 15 MAY 2023: On the occasion of ongoing Hanuman Jayanti Utsavams devotional cultural programs were held at Akasa Ganga, Nada Neerajanam platforms in Tirumala on Monday.

SV Vedic students recited Hanumam Chalisa at Anjanadri followed by devotional Sankeertans by the artistes of Dasa Sahitya Project.

Sri Siddheswarananda Bharati Swamy of Kurtalam rendered Anugraha Bhashanam at Nada Neerajanam.

He said Hanuman is a symbol of selfless service, courage and wisdom. If we pray to Hanuman we will get all these qualities which are most important to lead a righteous life. Astadasa Puranas and Venkatachala Mahatyam have clearly stated that Anjanadri in Tirumala is the birth place of Anjaneya “, he asserted.

Annamacharya Project Director Sri Vibhishana Sharma was also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఆంజనేయుడు శివాంశ సంభూతుడు : శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి

తిరుమల, 2023 మే 15: శ్రీ ఆంజనేయస్వామి శివాంశ సంభూతుడని కుర్తాళం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి తెలిపారు. తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాదనిరాజనం వేదికపై స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి అనుగ్రహ భాషణం చేస్తూ, సృష్టిలో రుద్రశక్తిని మించింది లేదని మంత్ర శాస్త్రంలో చెప్పబడిందన్నారు. రుద్రుడి అంశ అయిన హనుమంతుడిని లలితా దేవి రాముడికి సహాయంగా ఇచ్చిందని తెలియజేశారు. సూర్యుడు- ఆరోగ్యాన్ని, విష్ణు- మోక్షాన్ని, శివుడు -ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే ఆంజనేయుని ఆరాధిస్తే బుద్ధి, బలం, ధైర్యం సిద్ధిస్తుందని చెప్పారు.

అష్టాదశపురాణాల్లోని శ్రీ వేంకటాచలమాహాత్మ్యంలో స్పష్టంగా అంజనాద్రే హనుమ జన్మస్థలంగా చెప్పబడిందని వివరించారు.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ విభీషణ శర్మ “తిరుమల హనుమజన్మక్షేత్రం ” అనే అంశంపై మాట్లాడుతూ, తిరుమలలో అంజనదేవి తపస్సు, వాయువు దేవుని కటాక్షంతో హనుమంతుడు జన్మించిన‌ట్లు స్కాంద, భవిష్యోత్తర, వరాహ, బ్రహ్మాండపురాణాల్లో వేంకటాచల మాహాత్మ్యఖండాల్లో చెప్పబడినట్లు వివరించారు.

ఆకాశ‌గంగ‌లో ఆక‌ట్టుకున్న హనుమన్ చాలీసా

హ‌నుమ‌జ్జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సోమవారం తిరుమ‌ల‌లోని ఆకాశ‌గంగ శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద గ‌ల వేదిక‌పై నిర్వ‌హించిన హనుమన్ చాలీసా కార్య‌క్ర‌మం భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. అదేవిధంగా జ‌పాలి తీర్థంలో భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఆకాశ‌గంగలోని శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం విద్యార్థులు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు హనుమన్ చాలీసా ప‌ఠించారు. మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4 గంట‌ల వ‌ర‌కు దాస సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారులు ఆంజ‌నేయ‌స్వామివారిపై సంకీర్త‌న‌లు గానం చేశారు.

జ‌పాలి శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఉద‌యం 8.30 నుండి 10.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ రఘునాథ్ బృందం హనుమన్ చాలీసా ప‌ఠించారు. ఉదయం 10.45 నుండి మధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు శ్రీ‌రామ నామ సంకీర్త‌న‌లు ఆల‌పించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుండి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు హ‌రిక‌థ పరాయణం చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.