HANUMAN JAYANTHI CELEBRATED WITH RELIGIOUS FERVOUR IN TIRUMALA _ భక్తాగ్రేసరుల్లో సర్వోత్కృష్టుడు హనుమంతుడు : తితిదే ఈవో

TIRUMALA, JUNE 03:  The annual Salakatla ‘Hanuman Jayanti’ has been celebrated with religious fervour at the famous hill temple of lord Venkateswara on the auspicious day Vaisakha Dasami on Monday.
 
The temple priests performed special pujas including Panchamrithabhishekam with milk, curd, honey, coconut water and Sandal paste to the Bedi Anjaneya Swamy temple which is situated in front of the main temple, followed by Archana, Arathi, Naivedyam. Special pujas have also been performed to the Konerugattu Anjaneya Swamy located opposite BhuVaraha Swamy temple and in the evening at around 3 pm special pujas were performed to the 60-ft tall Prasanna Anjaneya Swamy at the seventh mile on the first ghat road.
 
TTD has made elaborate arrangements including free transportation bus facility for the sake of the locals and pilgrims to carry them from Tirumala to Seventh Mile and back to Tirumala on this festival day from 11am till 6pm.
 
Later the EO also took part in the Hanuman Jayanthi festival which was performed in the famous Japali theertham, situated about 5 km Tirumala main temple in dense forest. EO presented silk vastrams to the presiding deity of Japali Hanuman. Earlier EO and officials of TTD have been accorded warm welcome by Hathiramji Mutt’s Arjun Das Swamiji. After darshan, talking to media persons, EO said TTD will take up development works jointly with Hathiramji Mutt authorities in Japali Teertham with prior permission from the Endowments department. “As this part of the temple comes under the jurisdiction of Endowments we have to take up the development works only with their permission. We will construct a shed so that annaprasadams can be prepared for the sake of visiting pilgrims.
  Adding further the EO said, “Lord Anjaneya is a role model to all devotees as he pioneered “Sharanagati Prapatti” being the ardent devotee of Lord Sri Rama. “He is an inspiration to the devotee fraternity for selfless devotion and sacrifice”, he added.
 
Temple Deputy EO Sri C Ramana and others were also present.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
భక్తాగ్రేసరుల్లో సర్వోత్కృష్టుడు హనుమంతుడు : తితిదే ఈవో

తిరుమల, జూన్‌ 03, 2013: దాసభక్తికి ప్రతీక అయిన ఆంజనేయస్వామి భక్తాగ్రేసరుల్లో అత్యంత ఉత్కృష్టమైనవారని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. తిరుమలలో సోమవారం హనుమజ్జయంతి అత్యంత వైభవంగా జరిగాయి.
 
ఈ సందర్భంగా జాపాలీ తీర్థంలో ఆంజనేయస్వామి దర్శనానంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ సంపూర్ణ శరణాగతే జీవన పరమావధిగా చేసుకున్న భక్తాగ్రగణ్యుడు హనుమంతుడని పేర్కొన్నారు. జీవితాంతం రామనామస్మరణే ధ్యేయంగా మలచుకుని నేటికీ చిరంజీవిగానే ఉంటూ భక్తుల కోరికలను ఈడేరుస్తున్న కల్పతరువుగా ఆంజనేయస్వామి ప్రసిద్ధిగాంచినట్టు తెలిపారు. నేడు తిరుమలలో హనుమజ్జయంతిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం ఎదురుగా గల శ్రీ బేడి ఆంజనేయస్వామి, జాపాలీ తీర్థం, మొదటి ఘాట్‌ రోడ్డులోని ఏడో మైలు చెంత వెలసిన హనుమంతుని భారీ విగ్రహానికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. జాపాలీ తీర్థం అటవీ ప్రాంతంలో ఉన్న కారణంగా సాయంత్రం 6.30 గంటల తరువాత భక్తులు ఇక్కడ ఉండే అవకాశం లేదన్నారు. అయితే భక్తుల సౌకర్యార్థం తితిదే ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. హథీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఈ ఆలయం ఉన్న కారణంగా వారందించే ఆర్థిక సహాయం మేరకు తితిదే ఇంజినీరింగ్‌ అధికారులు నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు వివరించారు. తిరుమలకు విచ్చేసే భక్తులు చాలామంది జాపాలీ తీర్థానికి విచ్చేసి ఆంజనేయస్వామిని సేవించుకుంటున్నట్టు చెప్పారు. ఈ కారణంగా ఇక్కడ వెలసిన పుష్కరిణికి మరమ్మతులు చేస్తామన్నారు. అన్నప్రసాద వితరణకు వీలుగా ఒక షెడ్డును నిర్మిస్తామని వెల్లడించారు.
 
ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా గల శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 9.00 గంటలకు స్వామివారికి వేదమంత్రాల నడుమ ప్రత్యేక అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనాదులతో జరిగిన ఈ అభిషేక మహోత్సవంలో తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ బి.కిషోర్‌, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ ప్రభృతులు పాల్గొన్నారు.
 
అనంతరం శ్రీవారి తరఫున తన అత్యంత ప్రియదాసుడైన హనుమంతునికి శ్రీవారి పట్టువస్త్రాలను తిరుమలకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న హథీరాంజీ మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న జాపాలీ పుణ్యక్షేత్రంలో వెలసిన ఆంజనేయస్వామివారికి ఈవో కానుకగా సమర్పించారు. హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
 
ఈ కార్యక్రమంలో హథీరాంజీ మఠానికి చెందిన శ్రీ అర్జున్‌దాస్‌ స్వామి, తితిదే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా సోమవారం సాయంత్రం 3.00 గంటలకు మొదటి ఘాట్‌లోని ఏడో మైలు వద్ద ఆంజనేయస్వామి నిలువెత్తు భారీ విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
            
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.