HANUMAN JAYANTI FETE IN ANJANADRI TIRUMALA FOR THE WELFARE OF HUMANITY-KANCHI PONTIFF _ హనుమంతుడు లోకోద్ధారకుడు : కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి

TIRUMALA, 16 MAY 2023: The five day Hanuman Jayanti celebrations in the Birth place of Sri Anjaneya, the Anjanadri Tirumala mulled by TTD for the well-being of the entire humanity is a laudable move, said HH Sri Vijayendra Saraswati Swamy, the Chief Pontiff of Kanchi Kamakoti Peetham.

 

The Maha Swamy of Kanchi rendered Anugraha Bhashanam at Nada Neerajanam platform on Tuesday held as a part of ongoing Hanuman Jayanti celebrations.

Speaking on the occasion he said Hanuman is a symbol of valour, courage and selfless service. He also made some Puranic references which asserts Anjanadri in Tirumala is the birthplace of Sri Anjaneya.

 

The Pontiff also took part in the Purnahuti at Dharmagiri and appreciated TTD for arranging a unique program like Sampoorna Akhanda Sundarakanada Parayanam on the middle day of the five day event.

 

TTD EO Sri AV Dharma Reddy, Annamacharya Project Director Dr Vibhishana Sharma and others were also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

హనుమంతుడు లోకోద్ధారకుడు : కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి

తిరుమల, 2023 మే 16: లంకలో దుఃఖంలో ఉన్న సీతాదేవికి శోకోద్ధరణ చేసినందునే హనుమంతుడు లోకోద్ధారకుడు అయ్యాడని కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఉద్ఘాటించారు. తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నాదనీరాజనం వేదికపై స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ అంజనాద్రి హనుమంతుని జన్మస్థలం అని చెప్పేందుకు చారిత్రకంగా, పౌరాణికంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. హనుమంతుని అపారమైన భక్తి, కార్యదీక్ష, ధైర్య సాహసాలతో భక్తలోకానికి ఆరోగ్య ప్రదాతగా మారారని తెలియజేశారు.

టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ రామజన్మభూమి ఖరారైన తర్వాతే వెంకటాద్రి రాముని భక్తుడైన హనుమంతుని జన్మస్థలం నిర్ణయించబడడం దైవసంకల్పం అన్నారు. ఇది మానవుల నిర్ణయం కాదని, సాక్షాత్తు మాధవుడే నిర్ణయించారని తెలిపారు. భగవంతుని కృపతో పౌరాణిక, చారిత్రక, భౌగోళిక ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రి హనుమంతుని జన్మస్థలంగా నిరూపితమైందన్నారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ డా. విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.