HANUMAN JAYANTI HELD AT KRT _ శ్రీ కోదండరామాల‌యంలో ఘనంగా హనుమజ్జయంతి

TIRUPATI, 25 MAY 2022: In connection with Hanuman Jayanti, special events took place at Sri Hanuman temple located opposite to Sri Kodanda Rama Swamy temple in Tirupati on Wednesday.

Special Abhishekam was rendered to the Mula Virat and utsava deities of Sri Sita Rama Lakshmana Swamy on the occasion. Later in the evening Hanumanta Vahana Seva takes place between 7pm and 8.30pm.

Temple DyEO Smt Nagaratna, AEO Sri Durgaraju, Pradhana Archaka Sri Ananda Kumar Deekshitulu, Superintendent Sri Ramesh and others, devotees participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ కోదండరామాల‌యంలో ఘనంగా హనుమజ్జయంతి

తిరుపతి, 2022 మే 25: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగావున్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో బుధ‌వారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఉదయం 7.30 గంట‌ల‌కు శ్రీ సీతారామ‌ల‌క్ష్మ‌ణ‌స్వామి ఉత్స‌వ‌మూర్తులను శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యానికి వేంచేపు చేశారు. శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు, శ్రీసీతారామ, లక్ష్మణ స్వామివార్ల ఉత్సవర్లకు వైభవంగా అభిషేకం నిర్వ‌హించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీ రామ‌చంద్ర‌మూర్తి హనుమంత వాహనంపై ఊరేగుతారు.

హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. దాస్య‌భక్తికి ప్రతీకగా శ్రీ‌రాముల‌వారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఆనంద్‌కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.