GAJA VAHANA SEVA HELD _ గజ వాహనంపై లోకాభిరాముడు

TIRUPATI, 04 APRIL 2022: On the sixth day evening Gaja Vahana Seva was held in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Monday.

 

Both the Pedda Jeeyar and Chinna Jeeyar Swamijis of Tirumala, Spl Gr DyEO Smt Parvati, AEO Durgaraju, Kankanabhattar Sri Ananda Kumar Deekshitulu and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

గజ వాహనంపై లోకాభిరాముడు
 
తిరుపతి, 2022 ఏప్రిల్ 04: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం రాత్రి స్వామివారు గజ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వరకు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ జరుగనుంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
 
హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో గానీ, రాజదర్బారుల్లో గానీ, ఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.
 
వాహ‌న‌సేవ‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.