HANUMANTHA VAHANAM HELD _ హనుమంత వాహనంపై శ్రీ కోదండ రాముడి అభయం
Tirupati, 24 Jun. 21: Hanumantha Vahana Seva took place at Appalayagunta on Thursday morning as part of ongoing annual brahmotsavams.
On the sixth day, as Kodanda Rama, Sri Prasanna Venkateswara took out a celestial ride on Hanumantha Vahanam which was held in Ekantam.
Later in the afternoon, Vasanthotsavam held.
DyEO Smt Kasturi Bai and others participated.
SILKS PRESENTED TO CHANDRA MOULESWARA SWAMY
Following the traditional practice, pattu vastrams were presented to Sri Chandra Mouleswara Swamy temple at Appalayagunta.
DyEO Smt Kasturi Bai presented these silks on the occasion of the ongoing annual fete.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
హనుమంత వాహనంపై శ్రీ కోదండ రాముడి అభయం
తిరుపతి, 2021 జూన్ 24 : అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండ రాముడై హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించారు.
స్వామివారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించారు. హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన శ్రీ కోదండ రాముడిని దర్శించడం వల్ల భోగ భాగ్యాలు, జ్ఞానవిజ్ఞానాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి.
మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆలయంలో వసంతోత్సవం జరుగనుంది.
సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు గజవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మరియు కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
శ్రీ చంద్ర మౌళీశ్వరస్వామివారికి పట్టు వస్త్రాల బహూకరణ
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి అప్పలాయగుంటలోని శ్రీ చంద్ర మౌళీశ్వరస్వామివారికి పట్టు వస్త్రాలు బహూకరించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.