HANUMANTHA VAHANAM IN SAKSAHTKARA VAIBHAVOTSAVALU _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు

Tirupati, 29 June 2017: The Lord Sri Kalyana Venakteswara Swamy took celestial ride on Hanumantha Vahanam as a part of the second day of the ongoing three Sakshatkara Vaibhavotsavalu in Srinivasa Mangapuram on Thursday evening.

Earlier in the morining Snapana Tirumanjanam was performed followed by Unjal seva in the evening.

Temple DyEO Sri Venkataiah and others were also present.

While on June 30, the lord will ride on Garuda Vahanam.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు

తిరుపతి, 2017 జూన్‌ 29: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు రెండవ రోజైన గురువారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు స్వామివారి ఊంజల్‌సేవ కన్నుల పండువగా జరుగనుంది. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో తిరుప్పావడసేవ, ఆర్జిత కల్యాణోత్సవం సేవలను రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వేంకటయ్య, ఎఈవో శ్రీ ధనంజయ, సూపరింటెండెంట్‌ శ్రీ చంద్రశేఖర్‌బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీఅనిల్‌కుమార్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జూన్‌ 30న గరుడవాహనంపై ఊరేగనున్న స్వామివారు:

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు అభయమివ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.