SRI SUNDARARAJA RIDES HANUMANTHA VAHANAM_ హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం

Tiruchanoor, 24 Jun. 19: On the second day of Avatara Mahotsavam at Sri Sundararaja Swamy temple within the Sri Padmavathi Ammavari temple complex in Tiruchanoor, Lord Sundararaja rode on Hanumantha vahanam on Monday night and blessed devotees.

After morning rituals Sahasra Namarchana and Abhisekam at Mukha mandapam, Lord enthralled devotees during unjal seva.

DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam,Superintendent Sri Gopalakrishna Reddy, archakas and other officials participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం

తిరుపతి, 2019 జూలై 24: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమ‌వారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమివ్వనున్నారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంత‌రం మధ్యాహ్నం 2.00 నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌ సేవ వైభవంగా జరిగింది.

అనంతరం ఆలయ బయట గల వాహనమండపంలో శ్రీసుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేస్తారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. కాగా మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝాన్సీరాణి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణ, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.