HARI DASAS ARE TRUE HINDU DHARMA CAMPAIGNERS- TTD JEO _ హరిదాసులు హిందూ ధర్మ ప్రచారకులు – టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం

Tirupati, 25 August 2022: The TTD JEO Sri Veerabrahmam hailed the Haridasas as torch bearers of Hindu Sanatana Dharma.

 

Speaking at a gathering after the tri-monthly Metlotsavam Shobha Yatra on Thursday evening, the JEO said the contribution of the Dasa Sahitya Project of TTD in the propagation of Sanatana Hindu dharma is invaluable.

 

He called upon the 7200 plus bhajan mandals in the Project to take up Dharmic activities in every village.

 

He exhorted that not only the youth but also the children should be made partners in the campaign for Hindu Dharma.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హరిదాసులు హిందూ ధర్మ ప్రచారకులు- టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 25 ఆగస్టు 2022: హరిదాసులు గ్రామాల్లో సనాతన హిందూ ధర్మ ప్రచారకులని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు.

దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శ్రీ గోవింద రాజ స్వామి ఆలయం నుంచి ప్రారంభించిన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ శోభా యాత్ర మూడవ సత్రాల వద్దకు సాగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జెఈవో మాట్లాడారు.

హిందూ ధర్మప్రచారంలో దాస సాహిత్య ప్రాజెక్టు చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు. ప్రాజెక్టు పరిధిలో సుమారు 7200 భజన మండళ్లు ఉన్నాయన్నారు. వీరందరూ తమ గ్రామ పరిధిలో ఉన్న మిగిలిన అన్ని భజన మండళ్లను కలుపుకుని ప్రతి గ్రామంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లోని యువత తో పాటు చిన్నారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు.

దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థ జెఈవోను సన్మానించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది