HDPP CONDUCTS GRAND GO POOJA IN AP AND TELANGANA_ తెలుగు రాష్ట్రాలలో ఘనంగా గోపూజ
Tirupati, 12 January 2018: The dharmic wing of the TTD- Hindu Dharma Prachara Parishad today successfully organised Grand Go Poojas were conducted today at select temples across AP and Telangana.
As part of its to perform Go Pooja to highlight the religious and social significance of the cow and its protection (Go Samrakshana) the TTD organized this ritual in the new temples built in the SC/ST colonies of both the states.
According to the HDPP spokesman, HDPP continued the practice of organizing religious discourses regularly in the evenings 6pm-8pm at the Mahati auditorium. As part of the same, the Brahmarshi Chaganti Koteswara Rao will present a discourse on the theme of ‘Vidhura Niti’ at the Mahati on January 14th and devotees were urged to take advantage of the unique discourse.
SURYA NAMASKARS ON RATHA SAPTHAMI DAY JAN 24
Under the aegis of the HDPP, Students will be trained in Surya Namaskaras and tiny tots will be trained in the chanting of Aditya Hridaya sloka by trained Yoga experts and Vedic pundits on January 24. This program will be conducted at select locations in both AP and Telangana.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
తెలుగు రాష్ట్రాలలో ఘనంగా గోపూజ
తిరుపతి, 2018 జనవరి 12: టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఆలయాల్లో శుక్రవారం గోపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. గోవు విశిష్టతను తెలియజేసి ప్రజలందరూ గోసంరక్షణకు పాటుపడేందుకు ప్రతి ఏడాదీ టిటిడి గోపూజ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టిటిడి సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి కాలనీలలో నూతనంగా నిర్మించిన ఆలయాల్లోనూ గోపూజ నిర్వహించారు.
‘విదురనీతి’పై జనవరి 14, 15వ తేదీల్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసాలు :
టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 14, 15వ తేదీల్లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ‘విదురనీతి’పై ధార్మికోపన్యాసాలు చేయనున్నారు.
ధర్మప్రచారంలో భాగంగా టిటిడి తరచూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలతో ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు ధార్మికోపన్యాసాలు జరుగనున్నాయి. తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని భక్తులు ఈ ధార్మికోపన్యాసాల్లో పాల్గొని ఆధ్యాత్మిక చైతన్యం పొందగలరని కోరడమైనది.
జనవరి 24న రథసప్తమినాడు సూర్యనమస్కారాలు :
జనవరి 24న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో యోగా గురువుల పర్యవేక్షణలో విద్యార్థిని విద్యార్థులతో సూర్యనమస్కారాలు, చిన్నారులతో ఆదిత్యహృదయ శ్లోక పఠనం చేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.