HDPP EXECUTIVE COMMITTEE MEETING HELD _ తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాల నిర్మాణం హెచ్ డి పిపి కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం
తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాల నిర్మాణం
హెచ్ డి పిపి కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం
తిరుపతి, 2020 ఆగస్టు 27: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండవ దశలో 500 ఆలయాలు నిర్మించాలని హిందు ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ తీర్మానించింది. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం కమిటీ సమావేశం జరిగింది.టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 500 ఆలయాల నిర్మాణానికి సమరసత సేవా సంస్థ తో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. మత్స్య కార, బిసి, గిరిజన, ఎస్ సి కాలనీల్లో ఆ సంస్థ ఆలయాలు నిర్మిస్తుంది. అసంపూర్తిగా ఉన్న ఆలయ నిర్మాణాన్నిపూర్తి చేయడానికి రూ.5 లక్షలు, కొత్తగా నిర్మించే ఆలయానికి రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేయడానికి కమిటీ తీర్మానించింది.
ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, పాలక మండలి సభ్యులు శ్రీ గోవింద హరి, శ్రీ శివకుమార్, జెఈవో శ్రీ బసంత్ కుమార్, హెచ్ డిపిపి సభ్యులు శ్రీ సుబ్బారావు, శ్రీ పెంచులయ్య, డిపిపి కార్యదర్శి శ్రీ రాజగోపాలన్ పాల్గొన్నారు. సభ్యులు శ్రీ అనంత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం లో పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirupati, 27 Aug. 20: The Executive Committee meeting of Hindu Dharma Prachara Parishad (HDPP) chaired by TTD Trust Board Chief Sri YV Subba Reddy was held in Sri Padmavathi Rest House at Tirupati on Thursday.
The meeting has discussed on the mechanism to take up the construction of 500 more temples in SC, ST, BC and fishermen colonies of both the Telugu States on a faster pace.
The committee decided that by signing an MoU between Samarasata Seva Foundation (SSF) and SRIVANI Trust, the works shall be taken up. A grant of Rs.5lakhs will be spend to renovate dilapidated temples and Rs.10lakhs to construct new ones.
Already 500 temples were constructed in both Telugu states by SSF with the joint collaboration of TTD and AP Endowments Department during the first phase.
The committee has also discussed on future plans for enhancing Hindu Dharma Prachara activities.
TTD EO Sri Anil Kumar Singhal, Committee members Sri Govinda Hari, Sri DP Ananta (through Video Conference) Sri Siva Kumar, Sri BV Subba Rao, Sri Penchalaiah, JEO Sri P Basanth Kumar, HDPP Secretary Sri Rajagopalan and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI