HDPP TO ORGANIZE SHLOKAS COMPETITIONS _ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అచ్యుతాష్టకం , విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్థ పోటీలు

TIRUPATI, 05 JANUARY 2023: The Hindu Dharma Prachara Parishad wing of TTD is organizing competitions to school students in Vishnu Sahasra Namam and Achutastakam.

The competitions will be held on February 1 at 9am in Annamacharya Kalamandiram.

For students below ten years in Achutastakam and for those between 10 years to 15 years in Vishnu Sahasra Namam will be conducted.

The students should register their names and the winners will be given away prizes on the same day

For more details contact 9676615643.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అచ్యుతాష్టకం , విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్థ పోటీలు

తిరుపతి, 2023 జనవరి 05: తిరుపతి నగరం లోని విద్యార్థినీ, విద్యార్థులకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అచ్యుతాష్టకం , విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్థ పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 వతేదీ ఉదయం 9 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో
ఈ పోటీలు జరుగుతాయి.

పదేళ్ళ లోపు విద్యార్థినీ, విద్యార్థులకు ”అచ్యుతాష్టకం” పై నిర్వహిస్తారు. 10 నుంచి 15 ఏళ్ళ లోపు వయసు గల విద్యార్థినీ, విద్యార్థులకు “విష్ణు సహస్రనామ స్తోత్రం” మీద పోటీలు జరుగుతాయి. ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో హాజరై పేర్లు నమోదు చేయించుకోవాలి.

విజేతలకు అదే రోజు అక్కడే బహుమతులు ప్రదానం చేస్తారు. మరిన్ని వివరాలకు 9676615643 మొబైల్ నంబర్ లో కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది