HEALTH CLOUD SYSTEM FOR TTD HOSPITALS SOON _ హెల్త్ క్లౌడ్‌ అప్లికేషన్ ద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలు – టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్. జ‌వ‌హ‌ర్ రెడ్డి

TIRUPATI, 09 APRIL 2022: As a part of its savour for IT initiative for a better administration, TTD is all set to launch Health Cloud System for all its Hospitals soon.

 

A review meeting in this regard with IT experts of TTD and Kare Experts Technologies(Jio) was held in Sri Padmavathi Rest House in Tirupati on Saturday by TTD EO Dr KS Jawahar Reddy.

 

Through a detailed PowerPoint Presentation, the Kare team explained the EO the benefits of the Health Cloud System which is an advanced digitalization platform in the Health Care System with faster patient data processing and queue management, enabling quicker service to more patients besides ensuring them quality treatment.

 

Later the EO said this next-gen technology will take the quality Medicare to the doorsteps of the patients. The TTD Health Cloud System will be launched in the month of July initially with SVIMS and Sri Padmavathi Children’s Hospitals and will be extended to all the TTD-run hospitals in a phased manner.

 

SVIMS Director Dr Vengamma and her team of doctors, FACAO Sri Balaji, IT Advisor to TTD Sri Amar Nagaram, Chief Information Officer Sri Sandeep and TTD IT team, experts from Kare Xperts Technologies (virtually) participated.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హెల్త్ క్లౌడ్‌ అప్లికేషన్ ద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలు – టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్. జ‌వ‌హ‌ర్ రెడ్డి

తిరుపతి, 2022 ఏప్రిల్ 09: టిటిడి ఆసుప‌త్రుల‌లో హెల్త్ క్లౌడ్ అప్లికేషన్ ద్వారా రోగులకు మరింత త్వరిత గతిన మెరుగైన సేవలు అందించవచ్చని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి అన్నారు, తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శనివారం ఈవో కేర్‌ ఎక్స్‌పర్ట్స్‌ టెక్నాలజీస్ (జియో) ఐటీ నిపుణులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి అధ్వ‌ర్యంలోని అన్ని ఆస్పత్రులలో అనుసంధానం చేస్తూ ఎక్కువ మంది రోగులకు త్వ‌రిత‌గ‌తిన నాణ్యమైన చికిత్సను అందించడానికి ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంద‌న్నారు. టిటిడి హెల్త్ క్లౌడ్ సిస్టమ్ జూలై నుండి స్విమ్స్‌ మరియు శ్రీ పద్మావతి చిన్న పిల్ల‌ల ఆసుప‌త్రుల‌లో తోలి విడ‌తలో ప్రారంభించనున్న‌ట్లు చెప్పారు. దశలవారీగా టిటిడి ఆధ్వర్యంలో నిర్వ‌హించే అన్ని ఆసుపత్రులకు ఈ సేవ‌లు విస్తరించనున్న‌ట్లు వివ‌రించారు.

అంతకుముందు టిటిడి ఐటి నిపుణులు, కేర్‌ ఎక్స్‌పర్ట్స్‌ టెక్నాలజీస్ (జియో) ఐటి నిపుణులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈవోకు హెల్త్ కేర్ సిస్టమ్‌లోని విప్ల‌వాత్మ‌క‌మైన అధునాతన డిజిటలైజేషన్ ప్లాట్‌ఫాం హెల్త్ క్లౌడ్ సిస్టమ్ యొక్క ప్రయోజనాలు, వేగవంతంగా రోగుల డేటా ప్రాసెసింగ్ మరియు క్యూ మేనేజ్‌మెంట్ గురించి వివరించారు.

స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఎఫ్ఏ అండ్ సిఎవో శ్రీ బాలాజి, టిటిడి ఐటి స‌ల‌హాదారు శ్రీ అమ‌ర్‌న‌గ‌ర, సీఐవో శ్రీ సందీప్ కుమార్ రెడ్డి, కేర్‌ ఎక్స్‌పర్ట్స్‌ టెక్నాలజీస్ (జియో) ఐటి నిపుణులు, స్విమ్స్ వైద్యులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.