HENCEFORTH UPI PAYMENTS FOR SERVICES IN TTD TEMPLES- TTD JEO _ టీటీడీ ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు : జేఈవో శ్రీ వీరబ్రహ్మం

Tirupati,01 July 2023: TTD JEO Sri Veerabrahmam said on Saturday directed officials concerned to arrange UPI-based payments like PhonePe and QR code scan-based debit cards for the sale of Seva tickets of TTD temples and subsidiary temples,  agarbattis, Panchagavya products, TTD diaries and calendars.

 

Addressing a virtual conference with officials of TTD temples across the country on Saturday he said all out efforts are made to ensure all convenience to devotees and provide all-round access to services.

 

Among other things, he instructed officials to put up sign boards and flexes at the railway station and bus stand about TTD temples, information bits on TTD websites and SVBC to empower the pilgrims.

 

He urged officials to focus on launching Kalyanotsavam fete and other arjita Sevas in TTD temples, promoting greenery and cleanliness and providing a spiritual ambience in the TTD temples.

 

TTD DyEOs Sri Gunabushan Reddy, Sri Govindarajan, Sri Vijaykumar, Smt Varalakshmi, Smt Shanti, Sri Natesh Babu, Sri Devendra Babu and officials of Vizag, Rishikesh, Kurukshetra, Kanyakumari, Bhuvaneswar, Jammu etc participated in the virtual conference.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు : జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి, 2023 జూలై 01: టీటీడీ స్థానికాలయాలు, బయటి ప్రాంతాల్లోని ఆలయాల్లో సేవ టిక్కెట్లు, ప్రసాదాలు, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డైరీలు, క్యాలెండర్లు కొనుగోలు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే, క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా యుపిఐ, డెబిట్ కార్డు (ఆన్ లైన్) ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని జేఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆయా ఆలయాల అధికారులతో శనివారం జేఈవో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధిపనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. టీటీడీ వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, యాత్రికులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్‌, బస్టాండు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల గురించి తెలిసేలా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా యాత్రికులు సులభంగా ఆలయాలకు విచ్చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారని అన్నారు.

స్థానికాలయాల్లో కల్యాణోత్సవంతోపాటు ఇతర ఆర్జితసేవలు ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలన్నారు .
ఆలయాల్లో పచ్చదనం-పరిశుభ్రతలో భాగంగా భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు పెంచాలని డిఎఫ్‌వోను ఆదేశించారు. అన్ని ఆలయాల్లో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమీక్షలో డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్‌రెడ్డి, శ్రీ గోవిందరాజన్‌, శ్రీ విజయకుమార్‌, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి శాంతి, శ్రీ నటేష్‌ బాబు, శ్రీ దేవేంద్ర బాబు, వైజాగ్, రిషికేష్‌, కురుక్షేత్ర, కన్యాకుమారి, భువనేశ్వర్‌, జమ్మూ తదితర ఆలయాల అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.