HIGHLIGHTS IN THE MONTH OF FEBRUARY 2020 _ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో 21.68 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం _ శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.89.07 కోట్లు

Tirupati, 06 March 2020 : A Record number of 21.68 lakh devotees had Srivari Darshan in February 2020

SRI VARI HUNDI COLLECTED  Rs 89.07 CRORES

A record number of 21.68 lakh devotees had darshan of  Sri Venkateswara Swamy in the month of February and in the same period the Srivari Hundi income also recorded a huge amount of ₹89.07 crore.

Following are the details of Srivari darshan and revenue from Srivari Hundi,  laddu Prasadam,  sale of tonsured hair ,rooms etc besides Anna Prasadam distributions, in February.

DARSHAN

A record 21.68 lakh devotees got Srivari darshan last month in comparison to only 19.93 lakhs in February last year.

HUNDI INCOME

TTD collected   ₹89.07cr  in February this year as against ₹ 83.44cr in February last year.

ANNAPRASADAM 

While 43.94 lakh devotees were provided Annaprasadams in February of 2019 while, nearly 48.40 lakh devotees were enjoyed Annaprasadam in February this year.

LADDU PRASADAM

83.91 lakh laddus were sold to devotees this February as against 82.38 lakh laddu Prasadam in February last.

KALYANAKATTA

 In all 07.77 lakhs devotees got hair tonsuring done at Tirumala in February this year as against 06.70 lakhs during the same period last year

ACCOMODATION

TTD has achieved a record 103 % occupancy of rooms in February this year as against 102 % occupancy in February last year.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

                           
ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో 21.68 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం
                   
 శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.89.07 కోట్లు
 
 తిరుమల, 2020 మార్చి 06 ; తిరుమ‌ల శ్రీ‌వారిని ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో 21.68 ల‌క్ష‌ల మంది ద‌ర్శించుకున్నారు. ఇందులో భాగంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం, హుండీ ఆదాయం, ల‌డ్డూ ప్ర‌సాదాలు, అన్నప్రసాదాల పంపిణీ, తలనీలాలు, గ‌దుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
 
దర్శనం :
 
గతేడాది ఫిబ్ర‌వ‌రి‌లో 19.93 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో 21.68 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
 
హుండీ ఆదాయం :
 
శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది ఫిబ్ర‌వ‌రిలో రూ.83.44 కోట్లు కాగా, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి ‌లో రూ.89.07 కోట్లు వచ్చింది.
 
అన్నప్రసాదం :
 
గతేడాది ఫిబ్ర‌వ‌రి‌లో 43.94 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో 48.40 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.
 
లడ్డూలు :
 
గతేడాది ఫిబ్ర‌వ‌రి‌లో 83.91 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి లో 82.38 ల‌క్ష‌ల‌‌ లడ్డూలను అందించారు.
 
తలనీలాలు :  
 
గతేడాది  ఫిబ్ర‌వ‌రిలో 6.70 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, ఈ  ఫిబ్ర‌వ‌రి‌లో 7.77 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.
 
గ‌దులు :
 
గ‌దుల ఆక్యుపెన్సీ గతేడాది ఫిబ్ర‌వ‌రి‌లో 102 శాతం న‌మోదు కాగా, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి‌లో 103 శాతం న‌మోదైంది.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.