HIGHLIGHTS OF TTD SVBC BOARD DECISIONS _ ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
Tirumala, 30 Jul. 20: The TTD run Bhakti channel, Sri Venkateswara Bhakti Channel Board met at Annamaiah Bhavan, Tirumala on Thursday evening under the Chairmanship of Sri YV Subba Reddy.
Following are highlights of the board meeting.
- SVBC to telecast programs to enhance spirituality among youth and children.
- SVBC to become an advertisement free channel.
- Kannada and Hindi broadcast soon to reach devotees across the country.
- Donations accepted for SVBC trust fund.
- Live telecast of Srimad Bhagavadgita and Garuda Puranam Parayanams from Nada Niranjanam platform soon.
- TTD and SVBC to promote more live telecasts after the spontaneous success and popularity of Sundarakanda and Virataparva parayanams.
- Srivari Kalyanotsava seva soon to be made online with virtual participation of devotees
- Arrangements to send Prasadam to devotees who book Srivari Kalyanotsavam in online.
TTD EO Sri Anil Kumar Singhal, SVBC MD Sri AV Dharma Reddy, FA & CAO Sri O Balaji, TTD board members Smt Sapna, Sri Srinivasa Reddy, SVBC CEO Sri Venkata Nagesh participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
తిరుమల, 2020 జూలై 30: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు సమావేశం గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. బోర్డు ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
– పిల్లలు, యువతలో ధార్మికతను పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయాలి.
– ఎస్వీబీసీని యాడ్ ఫ్రీ ఛానెల్ గా మార్చాలని నిర్ణయం.
– ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళాలు స్వీకరిస్తాం.
– త్వరలోనే దేశవ్యాప్తంగా హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు చేయాలని నిర్ణయం.
– త్వరలో తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శ్రీమద్భగవద్గీత, గరుడ పురాణం పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు నిర్ణయం.
– ప్రస్తుతం సుందరకాండ పారాయణానికి విశేష స్పందన వస్తోందని, విరాటపర్వ పారాయణం ఆకట్టుకుంటోందని, ఇలాంటి లైవ్ కార్యక్రమాలు మరిన్ని రూపొందించడంపై చర్చించారు.
– శ్రీవారి కళ్యాణోత్సవ సేవ త్వరలోనే ఆన్ లైన్ లో నిర్వహణ.
– కళ్యాణోత్సవ టికెట్లు కొనుగోలు చేసిన భక్తుల ఇళ్లకు శ్రీవారి ప్రసాదం, అక్షింతలు తదితరాలు పంపే ఏర్పాటు.
ఈ సమావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఎఫ్ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, బోర్డు సభ్యులు శ్రీమతి స్వప్న, శ్రీ శ్రీనివాసరెడ్డి, సిఈవో శ్రీ వెంకటనగేష్ పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.