HILL SHRINE GETS FRESH LOOK WITH “PARIMALAM” CLEANSING_ శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
KOIL ALWAR TIRUMANJANAM PERFORMED
Tirumala, 10 July 2018: The hill temple of Lord Venkateswara donned a fresh look after being cleansed with aromatic mixture “Parimalam”, as a part of Koil Alwar Tirumanjanam observed on Tuesday in connection with Anivara Asthanam which falls next Tuesday.
This traditional cleansing fete is observed four times in a year during Vaikuntha Ekadasi, Ugadi, Anivara Asthanam and Annual Brahmotavams.
Speaking on this occasion, TTD EO Sri Anil Kumar Singhal said, on the penultimate Tuesday of Anivara Asthanam, Koil Alwar Tirumanjanam was observed today in Tirumala temple. He said the entire temple premises including, roof, walls, floor, puja articles etc. have been cleansed and Parimalam an aromatic mixture is smeared all over, he added.
Meanwhile this temple fete was observed from 6am to 10 am on Tuesday. The temple staff took part in this cleansing fete with utmost devotion.
Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh VGO Sri Raveendra Reddy and others took part.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
జూలై 10, తిరుమల 2018: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారంనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని తెలియచేశారు.
ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారన్నారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచామన్నారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు.
అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించినట్లు తెలియచేశారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవలైన ఆష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసినట్లు, ఇతర ఆర్జిత సేవలు యధాతథంగా నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, విజివో శ్రీ రవీంధ్రారెడ్డి, పేష్కర్ శ్రీ రమేష్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.