HOMA MAHOTSAVAMS COMMENCES _ శ్రీ కపిలేశ్వరాలయంలో గ‌ణ‌ప‌తి హోమంతో విశేష‌పూజ హోమ మ‌హోత్స‌వాలు ప్రారంభం

Tirupati, 29 Oct. 19: The month long Homa Mahotsavams in the auspicious Karthika month have commenced on a grand religious note with Ankurarpanam on Tuesday evening followed by Ganapathi Homam.

As a part of the Viseshapuja Mahotsavams, Ganapathi Homam will be observed for three days till October 31.

On November 1 and 2, Sri Subramanya Homam will be observed. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

 

శ్రీ కపిలేశ్వరాలయంలో గ‌ణ‌ప‌తి హోమంతో విశేష‌పూజ హోమ మ‌హోత్స‌వాలు ప్రారంభం

తిరుపతి, 2019 అక్టోబ‌రు 29: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం గణపతి హోమంతో  విశేషపూజ, హోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీకపిలేశ్వరస్వామివారి క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన స్వామివారి సన్నిధిలో హోమాల్లో పాల్గొన‌డం ఎంతో పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం పంచ‌మూర్తుల‌కు పాలు, పెరుగు, తేనె, చంద‌నం, విభూదితో విశేషంగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వ‌హించారు. సాయంత్రం గ‌ణ‌ప‌తిపూజ‌, పుణ్య‌హ‌వ‌చ‌నం, వాస్తుపూజ‌, ప‌ర్య‌గ్నిక‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ‌, క‌ల‌శ‌స్థాప‌న‌, అగ్నిప్ర‌తిష్ఠ‌, గ‌ణ‌ప‌తి హోమం, ల‌ఘుపూర్ణాహుతి నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌రు 30, 31వ తేదీలలో కూడా గణపతి హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.

న‌వంబ‌రు 1వ తేదీ నుంచి శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం :

శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 1 మ‌రియు 2వ తేదీల‌లో శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం రెండు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. న‌వంబ‌రు 2న సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామివారి క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రిండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.