HOMA MAHOTSAVAMS IN KT _ జనవరి 16 నుంచి 21వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో హోమ మహోత్సవాలు

TIRUPATI, 13 JANUARY 2023: The Homa Mahotsavams seeking the well-being of entire humanity will be observed in Sri Kapileswara Swamy temple between January 16-21 in Tirupati.

The six day fete commences with Ganapathi Homam, allowed by Sri Subramanyeswara Swamy homam on January 17, Durga Lakshmi Saraswati Homam on January 18, Navgraha Homam on January 19, Dakshina Murthy homam on January 20, Rudra and Mrityunjaya Homam on January 21.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 16 నుంచి 21వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో హోమ మహోత్సవాలు

తిరుపతి, 2023, జనవరి 13: లోక కళ్యాణార్థం తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 16 నుంచి 21వ తేదీ వరకు ఆరు రోజులపాటు ప్రత్యేక హోమ మహోత్సవాలు జరుగనున్నాయి.

జనవరి 16న గ‌ణ‌ప‌తి పూజతో హోమ మహోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.

జనవరి 16న శ్రీ గణపతిస్వామివారి హోమం, జనవరి 17వ తేదీ శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం, జనవరి 18న శ్రీ దుర్గ, శ్రీ లక్ష్మీ, శ్రీ సరస్వతి అమ్మవార్ల హోమం, జనవరి 19న శ్రీ నవగ్రహ హోమం నిర్వహిస్తారు.

అదేవిధంగా, జనవరి 20న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, జనవరి 21న శ్రీ రుద్ర మరియు శ్రీ మృత్యుంజయ స్వామి వారి హోమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.