HOME SECRETARY LAUDS TTD DHARMIC PROGRAMMES _ టీటీడీ హిందూ ధార్మిక కార్యక్రమాలు అభినందనీయం – కేంద్ర హోంశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ భల్లా ప్రశంస
TIRUMALA, 15 NOVEMBER 2021: The Union Home Secretary Sri Ajay Bhalla appreciated the spiritual and dharmic programmes of TTD aimed at the promotion of Hindu Sanatana Dharma.
TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy have formally met the Home Secretary after Darshan on Monday. On this occasion, EO explained to him about the various Dharmic programmes taken up by TTD across the country.
Later, they presented Srivari portrait and “Roots” book. Telangana CS Sri Somesh Kumar was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ హిందూ ధార్మిక కార్యక్రమాలు అభినందనీయం
– కేంద్ర హోంశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ భల్లా ప్రశంస
తిరుమల 15 నవంబరు 20 21: టీటీడీ నిర్వహిస్తున్న హిందూ ధార్మిక కార్యక్రమాలను కేంద్ర హోం శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ భల్లా అభినందించారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన అజయ్ భల్లా దంపతులను చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా టిటిడి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న హిందూ ధార్మిక కార్యక్రమాలను ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి వివరించారు.
అనంతరం చైర్మన్, ఈవో అజయ్ భల్లా దంపతులకు శ్రీవారి ప్రతిమను, రూట్స్ ఆంగ్ల పుస్తకాన్ని బహూకరించి శాలువతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. చైర్మన్ ఈవో ఆయనను కూడా శాలువతో సన్మానించి రూట్స్ పుస్తకాన్ని అందించారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది