HOTEL MANAGEMENT COURSE IN MAHILA POLYTECHNIC_ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజి, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
Tirupati, 23 Jun. 18: TTD has invited applications from the interested candidates for the course of Hotel Management in SP Mahila Polytechnic college for the academic year 2018-19.
Interested candidates who have passed inter or with equivalent certificates can apply for this three-year Diploma course in Hotel Management and Catering Technology. For the two-year Diploma Course in Pharmacy, Students who have passed in Inter BiPC or MPC are alone eligible.
The applications will be received from candidates till July 5 and counselling will be conducted on July 12.
For more details please contact, 0877-2264603/9948350188/8985332244 for Hotel management and Catering Technology.
9299008151 for Pharmacy during office hours in working days.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజి, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి, 2018 జూన్ 23: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 2018-19వ విద్యాసంవత్సరానికి గాను మూడు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజీ, రెండు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు అహ్వానిస్తున్నారు.
డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ బైపిసి మరియు ఎమ్‌పిసి విద్యార్థినిలు మాత్రమే అర్హులు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ఎటువంటి వయోపరిమితి లేదు.
ఆసక్తి గల అభ్యర్థుల నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 12వ తేదీ కౌన్సెలింగ్ జరుగనుంది. కోర్సులో చేరిన వారికి ఉచిత హాస్టల్ మరియు భోజన సౌకర్యం కల్పిస్తారు. మరింత సమాచారం కొరకు వెబ్‌సైట్ నీశిశిచీ://గీగీగీ.ఖిశిలిబిచీ.దీరిబీ.రిదీ ( లేదా) నీశిశిచీ://గీగీగీ.రీలీశిలిశిబిచీ.వీళిఖీ.రిదీ చూడగలరు.
ఇతర వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్‌ను 0877-2264603, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజీ కోర్సుకు సంబంధించి 9948350188, 8985332244, డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సుకు సంబంధించి 9299008151 నంబరులో కార్యాలయం వేళల్లో సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.