TONSURED HAIR E-AUCTION YIELDS Rs. 6.39 CRORE TO TTD_ తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.6.39 కోట్లు
Tirupati, 4 January 2018: The e-auction of tonsured hair donated by devotees had yielded a Rs.6.39 crore to the TTD in the monthly auction exercise.
As per practice of e-auction of tonsured hair was conducted on first Thursday of the month under the supervision of the Tirumala JEO Sri KS Sreenivasa Raju in which 1,87,000kgs of hair of 1,2,3,4,5 and white categories were soldout on e-auction conducted on the MSTC platform.
The first category of (31 inches and above) hair and second variet of (16-30 inches, third (10-15), fourth (5-9) and fifth (5 and below) besides white hair were offered for e-auction.
Only 600 kgs of the 10,000 kgs of No-1 variety was sold at Rs.22494 per kg yielding a total Rs,1.35 crore.
2400 kgs of the 46,100 kgs of No-2 variety priced at Rs.17,223 per kg was sold earning Rs.4.13 crore, 500 kgs of the 30,300 kgs of No-3 category priced at Rs.2833 were sold earning Rs.14.17 lakhs.
All the 200 kgs of the No-4 category was soldat Rs.1195 per kg procuring Rs.2.39 lakhs.
Similarly all the 1,93,000 kgs of No-5 variety at Rs.24 per kg were sold out earning Rs.46.32 lakhs.
Even the 500 kgs of the 6900 kgs of white hair was sold at Rs.5462 per kg earning Rs.27.31 lakhs.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA
తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.6.39 కోట్లు
తిరుపతి, 2018 జనవరి 04: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.6.39 కోట్ల ఆదాయాన్ని గడించింది.
ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 1,97,200 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.
తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను టిటిడి ఈ-వేలంలో పెట్టింది.
కిలో రూ.22,494/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 10,000 కిలోలను వేలానికి ఉంచగా 600 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.1.35 కోట్ల ఆదాయం సమకూరింది.
కిలో రూ.17,223/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 46,100 కిలోలను వేలానికి ఉంచగా 2,400 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం సమకూరింది.
కిలో రూ.2,833/-గా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 30,300 కిలోలను వేలానికి ఉంచారు. ఇందులో 500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.14.17 లక్షల ఆదాయం లభించింది.
కిలో రూ.1,195/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 200 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా 2.39 లక్షల ఆదాయం వచ్చింది.
కిలో రూ.24/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 1,96,000 కిలోలను వేలానికి ఉంచగా 1,93,000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.46.32 లక్షల ఆదాయం సమకూరింది.
కిలో రూ.5,462/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 6,900 కిలోలను అమ్మకానికి ఉంచగా 500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా 27.31 లక్షల ఆదాయం లభించింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.