TTD NETS RS.12.62 CRORE TOWARDS SALE OF HUMAN HAIR_ తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.12.62 కోట్లు
Tirumala, 6 July 2017: TTD Nets Rs. 12.62 Crore towards sale of Human Hair in e-auction held under the supervision of TIrumala JEO Sri KS Sreenivasa Raju on Thursday.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.12.62 కోట్లు
తిరుపతి, 2017 జూలై 06: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.12.62 కోట్ల ఆదాయాన్ని గడించింది.
ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు పర్యవేక్షనలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 14,900 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.
తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను తితిదే ఈ-వేలంలో పెట్టింది.
కిలో రూ.23,071/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 7800 కిలోలను వేలానికి ఉంచగా 500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.1.15 కోట్ల ఆదాయం సమకూరింది.
కిలో రూ.17,223/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 45,900 కిలోలను వేలానికి ఉంచగా 5,500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.9.47 కోట్ల ఆదాయం సమకూరింది.
కిలో రూ.2,833/-గా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 11,100 కిలోలను వేలానికి ఉంచారు. ఇందులో 6,800 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.1.93 కోట్ల ఆదాయం లభించింది.
కిలో రూ.1,194/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 700 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.
కిలో రూ.33/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 97,000 కిలోలను వేలానికి ఉంచగా 2000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.66 వేల ఆదాయం సమకూరింది.
కిలో రూ.6,052/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 5,800 కిలోలను అమ్మకానికి ఉంచారు. తద్వారా 6.06 లక్షల ఆదాయం వచ్చింది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది