జనవరిలో హుండీ ఆదాయం రూ.83.84 కోట్లు : టిటిడి ఈవో
జనవరిలో హుండీ ఆదాయం రూ.83.84 కోట్లు : టిటిడి ఈవో
ఫిబ్రవరి 02, తిరుమల 2018: ఈ ఏడాది జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.83.84 కోట్లు వచ్చిందని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ గతేడాది జనవరిలో రూ.69.95 కోట్లు హుండీ ఆదాయం లభించిందని, ఈ ఏడాది అదనంగా రూ.13.89 కోట్లు అదనంగా ఆదాయం వచ్చిందని వివరించారు.
దర్శనం :
– గతేడాది జనవరిలో 20.70 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది జనవరిలో 20.97 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. గతేడాది కంటే 26,605 మంది భక్తులు ఎక్కువగా స్వామివారిని దర్శించుకున్నారు.
లడ్డూప్రసాదం :
– గతేడాది జనవరిలో 85.57 లక్షల లడ్డూలను అందివ్వగా, ఈ ఏడాది జనవరిలో 87.49 లక్షల లడ్డూలను భక్తులకు అందజేయడం జరిగింది. గతేడాది కంటే 1.92 లక్షల లడ్డూలను అదనంగా అందించడమైనది.
అన్నప్రసాదం :
– గతేడాది జనవరిలో 43.19 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందివ్వగా, ఈ ఏడాది జనవరిలో 49.08 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది. గతేడాది కంటే 5.89 లక్షల మందికి ఎక్కువగా అన్నప్రసాదాలు అందించడమైనది.
అదేవిధంగా, గతేడాది జనవరిలో 26.88 లక్షల మందికి టి, కాఫి, పాలు భక్తులకు అందించగా, ఈ ఏడాది జనవరిలో 33.58 లక్షల మందికి అందించడం జరిగింది. గతేడాది కంటే 6.70 లక్షల మంది అదనంగా స్వీకరించారు.
తలనీలాలు :
– గతేడాది జనవరిలో 7.92 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, ఈ ఏడాది జనవరిలో 7.95 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. అదనంగా 3,410 మంది తలనీలాలు ఇచ్చారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.