HYDERABAD TEMPLE BRAHMOTSAVAMS FROM JUNE 18-22 _ జూన్‌ 18 నుండి 22వ తేదీ వరకు హైదరాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 16 June 2018: The annual brahmotsavams in the Sri Venkateswara Swamy temple located in TTD information centre of Hyderabad will be conducted from June 18-22.

On June 17, Ankurarpanam will be performed while Dhwajavarohanam and Pedda Sesha Vahanam on June 18, Snapana Tirumanjanam to processional deities on June 19 and Hanumantha Vahanam in the evening and Gaja Vahanam, Srinivasa Kalyanam and Garuda Sevas on June 20.

On June 21 there will be Rathotsavam and Aswa Vahana Seva while on June 22, the annual fete will conclude with Pushpayagam and Dhwajavarohanam.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్‌ 18 నుండి 22వ తేదీ వరకు హైదరాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2018 జూన్‌ 16 హైదరాబాదు నగరంలోని హిమాయత్‌నగర్‌లో గల బాలాజీ భవన్‌లో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్‌ 18 నుండి 22వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ ఉత్సవాల సందర్భంగా జూన్‌ 17వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 18వ తేదీ ఉదయం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి శేష వాహనంపై స్వామివారు విహరిస్తారు. అలాగే జూన్‌ 19వ తేదీ ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, రాత్రి హనుమంత వాహనసేవ జరుగనుంది. జూన్‌ 20న ఉదయం గజవాహనం, శ్రీవారి కల్యాణం, రాత్రి గరుడవాహనసేవ కన్నులపండువగా జరుగనున్నాయి. జూన్‌ 21న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనసేవ వైభవంగా జరుగనున్నాయి. జూన్‌ 22వ తేదీ ఉదయం చక్రస్నానం, సాయంత్రం 6.00 గంటలకు పుష్పయాగం, రాత్రి ధ్వజావరోహణం వైభవంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.