I AM BLESSED – TTD CHAIRMAN _ నేను ధన్యజీవిని – ⁠మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ పండుగలో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డిI

RETIRED EMPLOYEES THANK CHAIRMAN – EO – JEO TRIO FOR MAKING THEIR LONG PENDING WISH COME TRUE

Tirupati, 12 March 2024: TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy, in an emotional way advocated that his life has been blessed and his heart filled with joy by giving house pattas to more than 9,000 employees and retired employees working in TTD in such a short period of time, which has never happened anywhere in the world. 

The Chairman was addressing a huge gathering of employees and retired employees at Mahati Auditorium as the Chief Guest to distribute the third installment of the house title proceedings distribution fest in on Tirupati on Tuesday. 

The TTD Chairman along with the EO Sri AV Dharma Reddy handed over the proceedings to 4 thousand employees and pensioners.

On this occasion, the Chairman said that 16 years ago, when he was the Chairman of TTD, he tried to give houses to the employees of TTD on the orders of the then Chief Minister late Dr. YS Rajasekhara Reddy.  He said that the allotment of houses to the employees was stopped due to the hurdles that came after his tenure and the pain still haunts him. 

He said that he got the opportunity as TTD Chairman for the second time with the blessings of Sri Venkateswara Swamy and the blessings of the Honourable Chief Minister Sri YS Jaganmohan Reddy, and he felt that the divine blessings of Srivaru made his long waited a sincere dream come true after one and a half decades. He said when this matter was brought to the attention of the Chief Minister,  he readily agreed with a kind heart.

”Today is a Red Letter Day in the History of TTD as over 9000 employees and retired employees were distributed house site pattas. I vow today that even the last person in TTD who joined a couple of years ago will also be given house pattas in future”, he asserted amidst a huge round of appreciation from the regular and retired employee fraternity.

Speaking on the occasion, TTD EO putforth the efforts behind this Maha Yagna of distributing house site pattas to regular and retired employees. He appealed to all not to believe false news spread by a section of media against the noble wish of government and TTD in providing housesite pattas which are cent percent legal and hurdle-free.

“TUDA layout is underway for Padiredu Aranyam house sites and similarly will be taken up at Palem also soon. Even those who were not alloted house site pattas due to court cases, new entrants will also be provided house pattas in the coming days”, he added amidst grand applause from audience.

Later the office bearers of Retired Employees Welfare Association expressed their immense gratitude to TTD Chairman Sri Bhumana Karunakara Reddy, EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam for making their decades-old dream come true.

Besides the Association President Sri Prabhakar Reddy, other office bearers including Sri Tota Venkateswarulu, Sri GLN Shastry, Sri Das, Retired CE Sri Ramachandra Reddy, Retired Lecturer Sri Bhumana Subramanyam Reddy, Retired DyEO Sri Chenga Reddy also spoke on the occasion.

Every inch of Mahati was filled by the beneficiaries.

JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, CPRO Dr Ravi, TTD Welfare Officer Smt Snehalata, DyEOs Smt Prasanthi, Sri Gunabhushan Reddy, Sri Shivaprasad, Sri Govindarajan besides various other officers, union leaders, retired employees, employees were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నేను ధన్యజీవిని

•⁠ ⁠నా మనసు ఆనందంతో నిండిపోయింది

•⁠ ⁠9,000 మందికి పైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇంటి స్థలాలు ఇవ్వడం ఎక్కడా జరుగలేదు

•⁠ ⁠ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇది సాధ్యమైంది

•⁠ ⁠మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ పండుగలో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి

ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై దుష్ప్రచారాన్ని నమ్మకండి : టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

తిరుపతి, 2024 మార్చి 12: ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఇంత తక్కువ వ్యవధిలో టీటీడీలో పనిచేస్తున్న 9,000 మందికి పైగా ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో తన జీవితం ధన్యమైందని, తన మనసు ఆనందంతో నిండి పోయిందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమంలో ఛైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి కలిసి 4 వేల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంటిస్థలం ప్రొసీడింగ్స్ అందజేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ 16 ఏళ్ల క్రితం తాను టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆదేశాలతో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు. తన పదవీకాలం ముగిసిన తర్వాత వచ్చిన అడ్డంకుల కారణంగా ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు నిలిచిపోయిందని, ఆ బాధ ఇప్పటికీ తన మెదడును తొలుస్తోందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి కరుణ, ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రెండోసారి తనకు టీటీడీ ఛైర్మన్ గా అవకాశం వచ్చిందని, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకే స్వామివారు తన భుజం తట్టినట్టుగా భావిస్తున్నానని అన్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని సంకల్పం చేసుకున్నానన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే అంగీకరించారని చెప్పారు.

వడమాలపేట, పాదిరేడు అరణ్యం వద్ద రెండు విడతల్లో 432 ఎకరాల్లో 5,221 మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించామన్నారు. ప్రస్తుతం ఏర్పేడు మండలం పల్లం వద్ద ఉద్యోగులకు, సర్వీస్ పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు కలిపి 4000 మంది ఇంటి స్థలాలు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాధ్యతాయుమైన ప్రభుత్వం ఉండబట్టే టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కేటాయింపు జరిగిందన్నారు. ఇంకా మిగిలిపోయిన ఉద్యోగులు, పెన్షనర్లకు అందరికీ తప్పకుండా ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలియజేశారు. అదేవిధంగా టీటీడీలోని కార్పొరేషన్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఎఫ్ఎంఎస్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులందరికీ రు.5 వేల నుండి రూ.20 వేల వరకు వేతనాలు పెంచినట్లు తెలియజేశారు. ఇలాంటి మంచి పనులు చేపట్టేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి, జేఈవో శ్రీ వీరబ్రహ్మంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ వడమాలపేట, పల్లం ప్రాంతాల్లో టీటీడీ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేటాయించిన ఇంటి స్థలాలకు సంబంధించి కొన్ని పత్రికలు, కొందరు వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. వడమాలపేట వద్ద రెండు విడతల్లో కలిపి 432 ఎకరాల్లో 5,221 మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలకు సంబంధించి లేఅవుట్, ప్లాట్ నంబర్లు వేసి, డిప్ తీసి ప్రొసీడింగ్స్ అందించామన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ భూమి కొనుగోలు, లేఅవుట్ అభివృద్ధి పనుల కోసం రూ.150 కోట్లు వెచ్చించామని వెల్లడించారు.

అదేవిధంగా ఏర్పేడు మండలం పల్లం గ్రామం వద్ద 400 ఎకరాలు ప్రభుత్వం నుండి కొనుగోలు చేసేందుకు రూ.90 కోట్లు వెచ్చించామని, 320 ఎకరాలను ఇప్పటికే జిల్లా అధికారులు టీటీడీకి స్వాధీనం చేశారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న స్థలంలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయిస్తూ ప్రస్తుతం ప్రొసీడింగ్స్ ఇస్తున్నామని, వెంటనే ప్లాట్ నంబర్లు వేసి, డిప్ తీసి ఉద్యోగులకు కేటాయిస్తామని వివరించారు. ఇక్కడ 723 మంది ఉద్యోగులకు, 3277 మంది పెన్షనర్లకు కలిపి 4,000 మందికి ఇంటి స్థలాల కేటాయిస్తున్నామని తెలియజేశారు. 2015వ సంవత్సరం వరకు చేరిన రెగ్యులర్ ఉద్యోగుల్లో 800 మంది, పెన్షనర్లు 1,780 మంది ఇంకా మిగిలారని చెప్పారు. పల్లం వద్ద ప్రస్తుతం 100 ఎకరాలు మిగులుగా ఉందని, మరో 200 ఎకరాలు ప్రభుత్వం నుండి కొనుగోలు చేసి మిగిలిన 2,580 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలియజేశారు. ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం ఇప్పటివరకు దాదాపు రూ.240 కోట్లు టీటీడీ ఖర్చు చేసిందని తెలిపారు. ఉద్యోగులు ఇప్పటివరకు రూ.85 కోట్లు టీటీడీకి తిరిగి చెల్లించారని, మిగిలిన ఉద్యోగులందరూ టీటీడీకి సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, ఇతర అధికారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.