IMPART VEDIC KNOWLEDGE TO MANKIND- TTD SO DHARMA REDDY _ వేదాల సారాన్ని మాన‌వాళికి అందించండి : టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala ,03 August ,2019: TTD special Officer ,Sri AV Dharma Reddy exhorted to students of Vedic studies that the essence of vedas and ancient knowledge should be imparted to future generations to promote righteous and moral bound lifestyles in society.

Speaking at the 127th convocation of the Dharmagiri Veda Vignana Peetham on Saturday he said TTD set up Veda Pathashala to rejuvenate the eclipsing Vedic studies by providing free education,economic support and basic facilities. As a result thousands of students are popularising the importance of Vedas today. He also applauded the parents of students for encouraging their wards in Vedic studies.

He said the Vedic students are equally important to IAS, IPS, IRS, doctors, engineers and other professions.

Veda Vijan Peetham Principal Sri Kuppa Venkata Shiva Subramanyam Avadhani highlighted its 136 glorious years chequered history and said 610 students in 17 faculties led by 50 teachers are presently engaged in the peetham.

He said students of the 12 year long Vedic studies attracted TTD financial grant of ₹3 lakhs in bank deposits and ₹ 1 lakh for those who underwent eight years courses.The students received these funds including the interest accrued after the completion of studies. They also became eligible for professional posts of Veda pundits, archakas,Purohits , teachers and also a dignified status in the society, he added.

Thereafter the Tirumala Special Officer presented certificates and 10 gram silver medals to all 31 graduates of the Peetham.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వేదాల సారాన్ని మాన‌వాళికి అందించండి : టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2019 ఆగష్టు 03 ;సాక్షాత్తు భగవంతుని స్వరూపమైన వేదాల సారాన్ని, అందులోని భ‌క్తిత‌త్వాన్ని మాన‌వాళికి అందించాల‌ని టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వేద విద్యార్థుల‌ను కోరారు. తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం 127వ స్నాతకోత్సవం శ‌నివారం ఘనంగా జరిగింది. 2018-19వ విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన 31 మంది వేద విద్యార్థులకు యోగ్యతాపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ వేద విద్య అంత‌రిస్తున్న స‌మ‌యంలో సంర‌క్షించేందుకు టిటిడి వేద పాఠ‌శాల‌లు నిర్వ‌హిస్తోంద‌న్నారు. ఉచితంగా విద్య‌, ఇత‌ర స‌దుపాయాలు, ఆర్థిక ప్రోత్సాహ‌కాలు అందిస్తున్న‌ట్టు తెలిపారు. త‌ద్వారా వేలాది మంది విద్యార్థులు వేద విద్య‌ను అభ్య‌సించి ప్ర‌చారం చేస్తున్నార‌ని వివ‌రించారు. వేద విద్య‌ను అభ్య‌సించేలా పిల్ల‌ల‌ను ప్రోత్స‌హిస్తున్న త‌ల్లిదండ్రుల‌కు ఈ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలియ‌జేశారు. వేద‌విద్య‌ను పూర్తి చేసిన పండితులు ఇత‌ర వృత్తివిద్య‌లు అభ్య‌సించిన‌వారెవ‌రికీ తీసిపోర‌ని పేర్కొన్నారు. ఎంత డ‌బ్బు సంపాదించినా మాన‌సిక ప్ర‌శాంత‌త, సంతోషంగా ఉండ‌డం చాలా ముఖ్య‌మ‌న్నారు. ఆల‌యాల్లో అర్చ‌కులు చ‌క్క‌గా కైంక‌ర్యాలు నిర్వ‌హించ‌డం ద్వారా ఆల‌య ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన భ‌క్తుల‌కు మాన‌సిక ప్ర‌శాంత‌త చేకూర్చాల‌న్నారు. వేద‌, ఆగ‌మ‌, స్మార్థ విద్య‌ను పూర్తి చేసుకున్న విద్యార్థులు నియ‌మ‌నిష్ట‌ల‌తో ఇత‌రుల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా ఉండాల‌ని కోరారు.

వేదవిజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కుప్పా వెంకటశివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ 136 సంవత్సరాల పీఠం చరిత్రను తెలియజేశారు. ప్రస్తుతం 17 విభాగాల్లో 610 మంది విద్యార్థులు, 50 మంది అధ్యాపకులు ఉన్నట్టు తెలిపారు. ఈ పీఠంలో 12 సంవత్సరాలు వేదవిద్యను అభ్యసించే విద్యార్థులకు రూ.3 లక్షలు, ఎనిమిదేళ్ల పాటు అభ్యసించే ఆగమ-స్మార్థ-ప్రబంధ విద్యార్థులకు ఒక లక్ష రూపాయలు మొదట్లో బ్యాంకులో డిపాజిట్‌ చేస్తామని తెలిపారు. కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు ఈ మొత్తాన్ని బ్యాంకు వడ్డీతో కలిపి చెల్లిస్తామని వివరించారు. వేద విద్యను పూర్తిచేసినవారికి వేదపండితులుగా, అర్చకులుగా, పురోహితులుగా, అధ్యాపకులుగా సమాజంలో విశిష్టమైన స్థానం లభిస్తోందని చెప్పారు.

అనంతరం తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి 31 మంది విద్యార్థులకు యోగ్యతాపత్రాలు, నగదు బహుమతి, 10 గ్రాముల శ్రీవారి వెండి డాలర్‌ అందజేశారు. ఇందులో ఋగ్వేదం -6, శుక్ల‌య‌జుర్వేదం -2, కృష్ణ‌య‌జుర్వేదం(తైత్తిరీయ‌శాఖ‌) -8, కృష్ణయ‌జుర్వేదం(మైత్రాయ‌ణాయ శాఖ) – 3, సామ‌వేద కౌథుమ శాఖ – 2, సామ‌వేద జైమినీయ శాఖ – 3, అథ‌ర్వ‌వేదం – 1, వైఖాన‌సాగ‌మ‌ము – 3, శైవాగ‌మ‌ము -1, శుక్ల‌య‌జుర్వేద‌స్మార్త‌ము – 1, కృష్ణ‌య‌జుర్వేదస్మార్త‌ము -1 విద్యార్థులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ వేదవిజ్ఞాన పీఠం అధ్యాపకులు, వేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.