IMPORTANT DECISIONS BY TTD _ టీటీడీ ముఖ్యమైన నిర్ణయాలు

TIRUMALA, 13 AUGUST 2023: In the wake of the attack by wild beasts especially targetting children, TTD has taken two important decisions which came into force from Sunday itself.

 

The movement of leopards have been sighted at five places that includes three places near Alipiri to Galigopuram, at Sri Lakshmi Narasimha Swamy(LNS) temple and at the 38th Turning last night.

 

In this connection, TTD has decided to allow pilgrims with children aged below 15years from 5am to 2pm only to trek on both the footpath routes and this change came into force from Sunday itself.

 

In another important decision, the movement of the two-wheelers, have also been stalled from 6pm to 6am.

 

TTD Chairman Sri B Karunakara Reddy will hold a high-level meeting with the TTD EO, District Collector, SP at SP Rest House in Tirupati to discuss on the measures to be taken in view of the safety of the pilgrims in both the footpath routes and Ghat roads on Monday evening.

 

TTD has appealed to the devotees to extend their co-operation in following the guidelines taken by TTD keeping in view the larger interests of the pilgrim devotees till the issue of wild beasts is resolved.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ముఖ్యమైన నిర్ణయాలు

తిరుమల, 2023 ఆగస్టు 13: చిన్నారులపై క్రూరమృగాల దాడులు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

అలిపిరి నుండి గాలిగోపురం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలు కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో శనివారం రాత్రి చిరుతల సంచారం కనిపించింది.

ఈ నేపథ్యంలో 15 ఏళ్లలోపు పిల్లలు గల తల్లిదండ్రులను ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఆదివారం నుండే ఈ నిర్ణయం అమలవుతోంది. అదేవిధంగా రెండు ఘాట్ రోడ్లలో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేసింది.

కాలినడక మార్గాలు, ఘాట్‌లలో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

క్రూరమృగాల సమస్య పరిష్కారమయ్యే వరకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.