IMPORTANT RELIGIOUS OCCASIONS IN KRT _ ఆగస్టులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 23 JULY 2023: The following are the important religious events in the month of August in Sri Kodandarama Swamy temple in Tirupati.

August 1, 31: Pournami Astottara Sata Kalasabhishekam

August 5,12,19,26: : Abhishekam to Mula Virat

August 14: Sri Sita Rama Kalyanam in the advent of Punarvasu Star

August 16: Sahasra Kalasabhishekam and Hanumanta Vahanam

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2023 జూలై 23: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్ట్ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

– ఆగస్టు 1, 31వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో ఉద‌యం 9 గంట‌ల‌కు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల ఊరేగి ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

– ఆగస్టు 5, 12, 19, 26వ తేదీల్లో శనివారం సంద‌ర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 గంట‌లకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంత‌రం ఆలయంలో ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది.

– ఆగస్టు 14న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం, సాయంత్రం 5.30 గంట‌ల‌కు రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద ఊంజ‌ల్ సేవ జ‌రుగ‌నున్నాయి.

– ఆగస్టు 16వ తేదీ అమావాస్య నాడు ఆలయంలో ఉదయం 7 గంట‌ల‌కు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం క‌టాక్షించ‌నున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.