IMPOSING SRINIVASA KALYANAM AT CHICAGO _ చికాగోలో వైభవంగా శ్రీవారి కళ్యాణం

Tirupati, 02 July 2022:  Srinivasa Kalyanam fete was observed with utmost religious grandeur at Chicago City in the United States of America during the early hours on Friday as per IST which provided a feast to the NRI devotees who thronged the venue to witness the celestial wedding of Srivaru with His consorts Sri Sridevi and Sri Bhudevi.

The team of TTD archakas and Veda pundits performed the Srinivasa Kalyanam as per Agama traditions to the accompaniment of Mangala Vaidyam. The office-bearers of HGTC temple, Chicago presented pattu vastram on the occasion.

TTD is organizing the holy event across various cities in the United States in collaboration with APNRTS and  TTD advisory committees in each city.

The event was a feast to a countless number of NRI denizens who waited for hours to witness the celestial wedding, beget Srivari blessings and also the laddu Prasadam.

Renowned scholar Dr Medasani Mohan who is the AP Government Advisor on NRI affairs and President of APNRTS Sri Venkat S Medapati, SVBC Director Sri Srinivasa Reddy, TTD AEO Sri Venkateswarlu Naidu and local Indian associations, NRIs participated.

SRINIVASA KALYANAM

The various stages of Srivari Kalyanam fete comprised of Punyahavachanam, Viswaksena Aradhana, Ankurarpanam, Maha Sankalpam, Kanyadanam, Mangalya Dharana, Varana Mayiaram and finally Harati.

In the meantime, grand arrangements are being made for conducting the Kalyanam at Washington DC on July 3, at Atlanta on July 9 and Burmingham-Albama on July 10.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చికాగోలో వైభవంగా శ్రీవారి కళ్యాణం

తిరుపతి 2 జూలై 2022: తిరుమల తిరుపతి దేవస్థానములచే అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా భారతకాల మానం ప్రకారం శుక్రవారం వేకువ జామున చికాగోలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. టీటీడీ అర్చకస్వాములు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం, సాంప్రదాయ బద్దంగా కళ్యాణాన్ని నిర్వహించారు.

చికాగోలోని హెచ్ జి టి సి దేవస్థానం వారు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఎ పి ఎన్ ఆర్ టి ఎస్ టీటీడీ, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో సమన్వయం చేసుకుంటూ, కళ్యాణోత్సవం నిర్వహణలో పాలు పంచుకుంది.

అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించారు. భక్తులందరికీ లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ అవధాని డా. మేడసాని మోహన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు – ప్రవాసాంధ్రుల వ్యవహారాలు మరియు ఎ పి ఎన్ ఆర్ టి ఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, టీటీడీ ఎఈవో శ్రీ బి. వెంకటేశ్వర్లు,  ఇక్కడి కార్యనిర్వాహకవర్గం, స్థానిక భారతీయ సంస్థలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కళ్యాణం ఇలా…

శ్రీవారి కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.

ఇదిలావుండగా , జూలై ౩న వాషింగ్టన్ డి.సి. ఆటా మహాసభలలో వైభవంగా కళ్యాణం జరుపుటకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 9 న అట్లాంటా మరియు 10 న బర్మింగ్ హామ్ – అలబామాలలో శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది