IMPRESSIVE CULTURAL PROGRAMS IN RATHASAPTHAMI VAHANA SEVAS _ ర‌థ‌స‌ప్త‌మి వాహన‌సేవ‌ల్లో ఆక‌ట్టుకున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

Tirumala, 16 February 2024: Devotees were impressed with the colourful cultural programs organized by TTD’s Hindu Dharma Prachara Parishad and Dasa Sahitya Project during the Ratha Saptami Vahana Seva held at Tirumala Srivari Temple on Friday.

A total of 900 artists from the states of Andhra Pradesh, Telangana, Tamil Nadu and Karnataka participated.  Artistes from 5 art groups performed in each Vahana Seva. 

Performers impressed devotees with Kolatam, Legims, Deepanrityam, Kerala – Onam Dance, Folk Dance, Gopika Dance, Harathi Dance, Annamayya Vinnapalu Dance, Rajasthan – Dandiya Dance, Pondicherry – Karagattam, Assam-Bihu dance.

Apart from these, the artists performed Mohini Attam, Garbha dance, Bindela dance, Kuchipudi dance, Maharashtrian Lavani dance, Bengali dance.

All Projects Program Officer Sri Rajagopal and Dasa Sahitya Project Special Officer Sri. Ananda Theerthacharyulu supervised these programs.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

 

ర‌థ‌స‌ప్త‌మి వాహన‌సేవ‌ల్లో ఆక‌ట్టుకున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

తిరుమల, 2024 ఫిబ్రవరి 16: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో శుక్రవారం నిర్వ‌హించిన ర‌థ‌స‌ప్త‌మి వాహ‌న‌సేవ‌ల్లో టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 900 మంది క‌ళాకారులు పాల్గొన్నారు. ఒక్కో వాహన సేవలో 5 కళాబృందాలలోని కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. కళాకారులు కోలాటం, లెజిమ్స్, దీపనృత్యం, కేరళ – ఓనం నృత్యం, జానపద నృత్యం, గోపికా నృత్యం, హారతి నృత్యం, అన్నమయ్య విన్నపాలు నృత్య రూపకం, రాజస్థాన్ – దాండియా నృత్యం, పాండిచ్చేరి – కరగాట్టం ఆకట్టుకున్నాయి. వీటితోపాటు మోహినీ అట్టం, తెలంగాణ – గర్భ నృత్యం, బిందెల నృత్యం, కూచిపూడి నృత్యం, మహారాష్ట్ర లావణి నృత్యం, అస్సాం – భుయ నృత్యం, బెంగాలీ నృత్యాలను కళాకారులు చక్కగా ప్రదర్శించారు.

టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.